వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూర్ బార్ గర్ల్స్‌పై సామూహిక రేప్, ఎందరిపై?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Four youth arrested in rape case
బెంగళూరు: కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో బార్ గర్ల్స్ పైన సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎంతమందిపై అత్యాచారం జరిగిందన్న విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగిన సమయంలో అక్కడ కేవలం ఆరుగురు యువతులు ఉన్నారు. వారికి వైద్య పరీక్షలు జరిపారు. అయితే వీరిలో ముగ్గురు మాత్రమే రేప్ జరిగిందని ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో సుమారు పదిమంది అత్యాచారానికి పాల్పడ్డారని, వారంతా ఇరవై నాలుగేళ్ల లోపు వారేనని కమిషనర్ తెలిపారు. ఉత్తర భారత దేశానికి చెందిన ఎనిమిది మంది యువతులు ఈ ఇంట్లో నివసించేవారని.. వీరంతా గాంధీనగర్‌లోని ఓ బార్‌లో పని చేస్తున్నారని ఆయన తెలిపారు. వీరి రాకపోకలను క్షుణ్ణంగా గమనించిన స్థానికులే అత్యాచారానికి పాల్పడి వుండవచ్చునని ఆయన పేర్కొన్నారు.

దర్యాప్తు కొనసాగుతున్నందువల్ల వారి వివరాలు వెల్లడించలేమని చెప్పారు. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే ఎందరిపై అత్యాచారం జరిగిందన్న విషయం తెలుస్తుందని చెప్పారు. ఈ సంఘటనలో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నామని.. మిగిలినవారిని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు బెంగళూరు నగర కమిషనర్ జ్యోతి ప్రకాశ్ మిర్జీ వెల్లడించారు.

నేపాలి విద్యార్థినిపై అత్యాచారం కేసులో అరెస్ట్

సంచలనం సృష్టించిన నేషనల్ లా స్కూల్ యూనివర్శిటీకి చెందిన నేపాలి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో నగర పోలీసులు ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. శనివారం నగర పోలీసు కమిషనర్ వివరాలు వెల్లడించారు. నలుగురిని శుక్రవారం మధ్యాహ్నం, ముగ్గురిని ఆ తర్వాత అరెస్టు చేసినట్లు చెప్పారు.

English summary
Three women working in a bar in the Majestic area were allegedly molested by 8-9 men who barged into their house in Jagajyothi Layout in Mariyappanapalya, near Kengeri, on Thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X