వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసెంబర్ 9 ప్రకటన: తెలంగాణకోసం ఎబివిపి పాదయాత్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

ABVP padayatra for Telangana
హైదరాబాద్: ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్రలు చేస్తుండగా అఖిల భారత విద్యార్థి పరిషత్(ఎబివిపి) మరో మహా పాదయాత్రకు సిద్ధమైంది. 2009 డిసెంబర్ 9వ తేదిన తెలంగాణపై కేంద్రం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి త్వరలో ఈ పాదయాత్ర చేపట్టనుంది.

కేంద్రం తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండి వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేయాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి విద్యార్థి మహా పాదయాత్ర పేరుతో నవంబర్ 26 నుండి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎబివిపి నాయకులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాట్లాడారు. కేంద్రం తెలంగాణపై ప్రకటన చేసి వెనక్కి వెళ్లిందని, తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.

తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల నుండి సుమారు 500 మంది విద్యార్థులతో ఈ మహాపాదయాత్ర చేపడుతున్నామన్నారు. నవంబరు 26న తెలంగాణలోని ఐదు ప్రాంతాల నుండి ఒకేసారి ఈ పాదయాత్ర ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణలోని పది జిల్లాలను కలుపుకుని సుమారు పదిహేను వందల కిలో మీటర్ల వరకు ఈ పాదయాత్ర ఉంటుందన్నారు. ఈ పాదయాత్ర డిసెంబరు 7న హైదరాబాద్‌కు చేరుకుంటుందని చెప్పారు.

అదే రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. 12 రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాలో ఉంటుందన్నారు. మీడియా సమావేశంలో ఎబివిపి జాతీయ కార్యదర్శి కడియం రాజు, జాతీయ కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి పాండు రంగా రెడ్డిలు తెలిపారు.

English summary
Akhila Bharatha Vidyarthi Parishad(ABVP) is ready to maha padayatra for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X