హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయ పార్టీలు: మహిళా ఫైర్ బ్రాండ్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు మహిళా ఫైర్ బ్రాండ్స్ అదనపు బలం. పురుషులతో దీటుగా పోటీ పడి రాజకీయాల్లో నెగ్గుకొస్తున్న మహిళా రాజకీయ నేతలు రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు. అయితే, తమ దూకుడుతో, అదరగొట్టే డైలాగ్స్‌తో రాజకీయాలకు అదనపు ఆకర్షణను చేకూరుస్తున్న మహిళా రాజకీయ నాయకులు ఉన్నారు.

ప్రత్యర్థులను తమ వాడి వేడి మాటల తూటాలతో వారు అదరగొడుతూ ఉంటారు. విషయ పరిజ్జానంతోనే కాకుండా వాడి వాగ్బాణాలతో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వీరు ఎల్లవేళలా ప్రయత్నిస్తుంటారు. అయితే, పార్టీల్లో నెగలలేక బయటకు వచ్చి ఇతర పార్టీల్లో చేరిన మహిళా రాజకీయ నేతలు చాలా మందే ఉన్నారు. నిజానికి, మహిళా ఫైర్ బ్రాండ్స్‌కు తెలుగుదేశం పార్టీ మారుపేరుగా ఉండేది. కానీ, చాలా మంది అందులో ఇమడలేక బయటకు వచ్చారు.

పార్టీలు: మహిళా ఫైర్ బ్రాండ్స్

హీరోయిన్‌గా తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన రోజా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు అదనపు ఆకర్షణ. ఆమె తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా బెల్టు షాపులపై గర్జించారు. తెలుగుదేశం అనుబంధ సంస్థ తెలుగు మహిళకు ప్రత్యేకమైన గుర్తింపును, మనుగడను సంతరించి పెట్టారు. అయితే, రెండు సార్లు శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. నిజానికి, వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెసు పార్టీలో చేరడానికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. వైయస్ మరణంతో ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కొనసాగుతున్నారు.

పార్టీలు: మహిళా ఫైర్ బ్రాండ్స్

రాష్ట్ర రాజకీయాల్లో మహిళా నేతల దూకుడుకు రేణుకా చౌదరిని ప్రతీకగా చెప్పాలి. హైదరాబాద్ కార్పోరేటర్ స్థాయి నుంచి ఆమె పార్లమెంటు సభ్యురాలి స్థాయికి ఎదిగారు. తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆమె అప్పటి కాంగ్రెసు శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డితో స్ట్రీట్ ఫైట్‌కు దిగి వెలుగులోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్క మెట్టే ఎదుగుతూ వచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఇమడలేక కాంగ్రెసులోకి వచ్చారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగానే కాకుండా ఎఐసిసి అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నారు. మాటల తూటాలు విసరడంలోనే కాకుండా ఎదురుపడి ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో ఆమెది అందె వేసిన చేయి.

పార్టీలు: మహిళా ఫైర్ బ్రాండ్స్

గతంలో కాంగ్రెసు పార్టీలో ఉన్న నన్నపనేని రాజకుమారి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ మహిళా నేతగా ఆమెకు పేరుంది. ప్రత్యర్థులపై వాగ్బాణాలను విసరడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఇటీవల విద్యుత్ సమస్యపై తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టినప్పుడు శానససభ భవనం మీదికి ఎక్కి కూర్చుని హంగామా చేశారు. ఆమె దూకుడుకు దీన్ని తార్కాణంగా చెప్పవచ్చు.

పార్టీలు: మహిళా ఫైర్ బ్రాండ్స్

తెలంగాణ రాములమ్మగా పేరు పొందిన విజయశాంతిది ప్రత్యేకమైన దూకుడు. బిజెపి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి వచ్చిన ఈ సినీ హీరోయిన్ తెలంగాణ విషయంలో ఎదుటివారి మీదికి చురుకైన వ్యాఖ్యలు విసరడంలో పేరు పొందారు. తాను అన్నగా పిలుస్తున్న తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో ఆమెకు పడడం లేదని అంటారు. తాజాగా, తమ పార్టీ కాంగ్రెసులో విలీనం అయ్యే ప్రసక్తి లేదని ఆ బాణం వేశారు.

కాస్తా అటూ ఇటుగా మహిళా ఫైర్ బ్రాండ్ ఇంకా ఉన్నారు. కాంగ్రెసు గంగా భవానీ వంటివారున్నారు. తెలుగుదేశంలో శోభా హైమవతి వంటివారున్నారు. కానీ, ప్రధాన రాజకీయ నేతలుగా పేరు పొందినవారిగా మాత్రం వారినే చెప్పుకోవాలి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వాసిరెడ్డి పద్మ వంటివారున్నారు.

English summary
Every political party in Andhra Pradesh has its own woman leaders, called as fire brands. Renuka Chowdhary in Congress, Roja in YSR Congress and Nannapaneni Rajakumari in Telugudesam party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X