హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు చిన్న మెదడు చిట్లింది: గట్టు వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Gattu Ramachandar Rao
హైదరాబాద్/ ఒంగోలు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి చిన్న మెదడు చిట్లి పోయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచందర్ రావు వ్యాఖ్యానించారు. షర్మిల చేపట్టిన పాదయాత్రను చూసి తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలుగదేశం పార్టీకి బ్రాచ్ ఆఫీసుగా మారిందని దుయ్యబట్టారు.

తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తెలుగుదేశం పార్టీ మునిగిపోతున్న పడవ అని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైల్లో సెల్ ఫోన్ వాడుతున్నట్లు తెలుగుదేశం నాయకులు చేసిన ఆరోపణలను ఆయన తప్పు పట్టారు. దానికి రుజువులు చూపాలని ఆయన డిమాండ్ చేశారు. యనమల సహా తెలుగుదేశం నాయకులు జైలుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. సినిమా డైరెక్షన్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్ర ఓ నాటకమని, కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్లనే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం లేదని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. కుమ్మక్కు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.

English summary
YSR Congress spokesperson Gattu Ramachandar Rao lashed out at Telugudesam president N Chandrababu Naidu. He said that Sharmila padayatra is getting good response from masses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X