వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసులో ఆధారాలు: షర్మిల ఆరోపణలపై సందీప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాము వేధిస్తున్నామన్న ఆయన సోదరి షర్మిల వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని ఏఐసిసి అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ సోమవారం రాత్రి చెప్పారు. జగన్‌ను వెంటపడి కాంగ్రెసు వేధిస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న షర్మిల కాంగ్రెసుపై అవాస్తవాలు చెబుతోందన్నారు.

జగన్‌కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నందువల్లనే సిబిఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఆయన ఆస్తులపై విచారణ జరుపుతోందన్నారు. దాంతో కాంగ్రెసుకు సంబంధం లేదన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందని అభిప్రాయపడ్డారు. కక్ష సాధింపు అనడం సరికాదన్నారు. జగన్ కేసులో ఆధారాలు ఉండటం వల్లే సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించిందని గుర్తు చేశారు. బలమైన ఆధారాలు లభిస్తేనే దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతాయని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న షర్మిల కాంగ్రెసు కక్షతో తన సోదరుడిని జైలులో పెట్టిందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం కూడా ఆమె తన పాదయాత్రలో టిడిపి, కాంగ్రెసులపై నిప్పులు చెరిగారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై జగన్‌ను జైలులో పెట్టారని, రాజన్న ఎంతో ప్రేమగా చేపట్టిన సంక్షేమ పథకాలన్నింటికీ కిరణ్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారని, కార్పొరేట్ ఆసుపత్రిలో కాక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని ఆంక్షలు పెడుతున్నారని పేర్కొన్నారు.

English summary
AICC spokes person Sandeep Dikshit condemned YSR Congress party chief YS Jaganmohan Reddy's sister Sharmila's allegations against Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X