• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెళ్లికి గీతిక ఒత్తిడి, కందా నిరాకరణ: అరుణ చద్దా

By Pratap
|

Geetika Sharma
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ పెళ్లి చేసుకోవాలని హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందాపై ఒత్తిడి తెచ్చిందని, కందా నిరాకరిస్తూ వచ్చాడని అరుణ చద్దా చెప్పింది. గీతికా శర్మ ఆత్మహత్య కేసులో కందాతో పాటు అరుణ చద్దా కూడా ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కుంటోంది. కందా గీతికతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, దాన్ని కొనసాగించాలని ఒత్తిడి చేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పింది.

అటువంటి సంబంధాన్ని కొనసాగించడానికి గీతికా శర్మ ఇష్టపడలేదని, తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిందని చెప్పింది. తన సూసైడ్ నోట్‌లో గీతికా శర్మ తన మృతికి కందాతో పాటు అరుణ చద్దా కారణమని రాసిన విషయం తెలిసిందే. ఏదో సాకు చెబుతూ గోపాల్ కందా పెళ్లికి నిరాకరిస్తూ వచ్చాడని అరుణ చద్దా చెప్పింది.

గోవాకు చెందిన అంకితతో గోపాల్ కందా సంబంధాన్ని కూడా గీతికా శర్మ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిందని తెలిపింది. ఇప్పటికిప్పుడు పెళ్లికి ఒత్తిడి తేవద్దని కందా కోరికతో తాను గీతికకు నచ్చజెప్పే ప్రయత్నం చేసేదాణ్ననని ఆమె చెప్పింది. అరుణ చద్దా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. తనను పెళ్లి చేసుకోవడానికి కందా నిరాకరిస్తుండడంతో గీతికకు చాలా కోపం వచ్చిందని, దాంతో ఆమె ఎండిఎల్ఆర్ కార్యాలయానికి వెళ్లడానికి ఇష్టపడలేదని చెప్పింది.

గీతికపై ఒత్తిడి పెట్టడానికి కందా ఎంబిఎ చదవడానికి తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చాడని అరుణ చద్దా చెప్పింది. ఎంబిఎ కోర్సుకు ఎండిఎల్ఆర్ ఇచ్చిన స్పాన్సర్‌షిప్‌ను తిరిగి ఇచ్చేయాలని, పాఠశాలలు నడపడానికి ఏర్పాటైన విద్యా సంస్థ అధ్యక్షపదవికి రాజీనామా చేయాలని గీతికపై ఒత్తిడి తెచ్చారని, అందుకు గీతిక ఇష్టపడలేదని ఆమె వివరించింది. పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడంతో కందాను కలుసుకోవడానికి గీతిక నిరాకరిస్తూ వచ్చిందని అరుణ చద్దా చెప్పింది.

English summary
Aruna Chadha, facing prosecution along with former Haryana minister Gopal Kanda in former air hostess Geetika Sharma suicide case, has said in a statement that Geetika had been pressing Kanda to marry her but he avoided it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X