వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేటి నుంచి షిర్డీ ‘మహా సమాధి’ఉత్సవాలు

By Srikanya
|
Google Oneindia TeluguNews

 Shirdi Sai Baba's 94th Maha samadhi Festival from today
షిర్డీ: సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి 94వ మహా సమాధి ఉత్సవాలు ప్రారంభమైంది. శుక్రవారం వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సంస్థాన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కిశోర్ మోరే ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 4.30 గంటలకు కాకడ్ హారతి, ఐదు గంటలకు బాబా చిత్రపటం ఊరేగింపు, ద్వారకామాయిలో బాబా సచ్ఛరిత పారాయణ పఠనం జరిగింది.

మంగళ స్నానం, మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న హారతి, తీర్థ ప్రసాదాలు పంపిణీ, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భజనలు, కీర్తనలు ఉంటాయి. తర్వాత ధూప హారతి, రాత్రి ఏడున్నర నుంచి సాయినగర్ మైదాన్‌లో వివిధ కళాకారుల కార్యక్రమాలు ఉంటాయని మోరే చెప్పారు. రాత్రి 10.30 గంటలకు బాబా పల్లకీ షిర్డీ పుర వీధుల్లో ఊరేగింపు ఉంటుంది. మొదటి రోజు కావడంతో ద్వారకామాయిలో రాత్రంతా పారాయణ పఠనం ఉంటుందని చెప్పారు.

బుధవారం దసరా ఉత్సవం నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. యథావిధిగా కాకడ హారతి, అఖండ పారాయణ సమాప్తి, బాబా చిత్రపటం ఊరేగింపు, మంగళ స్నానం, తర్వాత దర్శనానికి భక్తులను అనుమతిస్తారని చెప్పారు. ఉదయం 10 గంటలకు భిక్షాటన, భజనలు, ఆరాధన తదితర కార్యక్రమాలుంటాయని, మధ్యాహ్నం హారతి, సాయంత్రం ఖండోబా మందిరం నుంచి ఊరేగింపు, ధూప హారతి, రాత్రి బాబా పల్లకీ ఊరేగింపు ఉంటుందని చెప్పారు.

గురువారం ఉదయం ఐదు గంటలకు మంగళ స్నానం, అనంతరం దర్శనం, మధ్యాహ్నం హారతి, తీర్థ ప్రసాదాలు పంపిణీ, సాయంత్రం ధూప హారతి, రాత్రి ఆలయం పక్కనున్న వేదికపై స్థానిక కళాకారుల వివిధ భక్తి కార్యక్రమాలు ఉంటాయని, 9.15 గంటలకు ఊరేగింపు, 10.30 గంటలకు శేజారతి ఉంటుందన్నారు. శుక్రవారం ఉదయం 4.30 గంటలకు కాకడ్ హారతి, 5.05కు మంగళ స్నానం, తర్వాత భక్తులకు దర్శనం, 6.45 గంటలకు గురుస్థాన్ మందిరంలో రుద్రాభిషేకం, 10 గంటలకు ఉట్టి ఉత్సవం, మధ్యాహ్న హారతి, సాయంత్రం ఆరు గంటలకు ధూప హారతి, రాత్రి వివిధ భక్తి కార్యక్రమాలు ఉంటాయన్నారు.

10.30కు శేజారతి, తర్వాత ఉత్సవాలు ముగింపు కార్యక్రమాలుంటాయని మోరే తెలిపారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించినట్లు చెప్పారు. అధ్యక్షుడిగా న్యాయమూర్తి జయంత్ కులకర్ణి, జిల్లాధికారి సంజీవ్‌కుమార్ మార్గదర్శకులుగా, సభ్యులుగా సంస్థాన్ పదాధికారి యశ్వంత్‌రావ్ మానే ఉన్నారు.

English summary
‘Sri Samartha Sadguru Sainath’s 94th Mahasamadhi day Celebrations to be held From 15-10-2012 to 24-10-2012. Today is the day where shirdi sai baba went into maha samadhi. 94 years passed since baba left us physically. But baba is with us in our minds in our thoughts and deeds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X