వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న మలాలా... నేడు హినా: తాలిబాన్ బెదిరింపులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Malala
ఇస్లామాబాద్: తాలిబాన్ల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మలాలా ఉదంతాన్ని మరిచిపోక ముందే మరో బాలిక తనను తాలిబాన్లు బెదిరిస్తున్నారంటూ ఊరు విడిచి వెళ్లిపోయింది. స్వాత్ ప్రాంతానికి చెందిన హినా ఖాన్ అనే విద్యార్థిని తాలిబాన్ల తాను హిట్‌లిస్టులో ఉన్నట్లు చెప్పుకుంది. ఆమె పదకొండో తరగతి చదువుతోంది. హినా ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉందని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని అంటున్నారు.

ప్రభుత్వం పట్టించుకోకపోవడం హినా కుటుంబ సభ్యులు పిల్లలను తీసుకుని ఇస్లామాబాద్‌కు తరలి వచ్చారు. తనకు ఇంకా బెదిరింపులు వస్తూనే ఉన్నాయని, ఇస్లామాబాద్‌లో కూడా తాను చదువు కొనసాగించలేనని హినా అన్నట్లు డాన్ న్యూస్ తెలిపింది. ఆడ పిల్లలు చదువుకునే పాఠశాలలపై మిలిటెంట్లు దాడులు చేస్తున్నారని, తాము చదువుకోలేకపోతున్నామని తోటివారు చెప్పడంతో హినా 2008లో తాలిబాన్లకు వ్యతిరేకంగా మాట్లాడింది. అప్పటి నుంచి ఆమె బాలికల విద్యను ప్రోత్సహించే క్రియాశీలక కార్యకర్తగా మారిపోయింది.

బాలికలు విద్యను అభ్యసించడాన్ని తాలిబాన్లు సహించడం లేదని, పాఠశాలలపై బాంబులు వేస్తున్నారని స్వాత్‌లోని తన మిత్రులు చెప్పడంతో హినా 2008లో నేషనల్ ప్రెస్ క్లబ్‌లవో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తాలిబాన్ల వైఖరిని విమర్శించింది.

ఈ ఏడాది ఆగస్టు నుంచి సామాజిక కార్యకర్త అయిన తన భార్య పర్షత్‌కు కూడా బెదిరింపులు వస్తున్నాయని, దాంతో తమ కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉందని హినా తండ్రి రైతుల్లా ఖాన్ డాన్ న్యూస్‌తో చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఇంటి బయటకు వచ్చేసరికి తమ ఇంటి గేటుకు క్రాస్ మార్కు ఉందని, పిల్లల పని అనుకుని తీసేశానని, ఆ మర్నాడే మళ్లీ క్రాస్ కనిపించిందని ఆయన అన్నారు.

మర్నాడే మలాలా తర్వాత హినానే తమ లక్ష్యమని కాల్ వచ్చిందని చెప్పారు. 15 ఏళ్ల మలాలాపై స్వాత్ లోయలో పాఠశాల బస్సులో కాల్పులు జరిపారు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

English summary
Just days after a deadly attack on Pakistani teenage rights activist Malala Yusufzai, another schoolgirl from Swat has claimed that she is on the Taliban hit list for raising her voice against their atrocities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X