వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురంధేశ్వరికి పగ్గాలు:నోచెప్పిన సింగ్, చిరుకు టూరిజమే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi - Purandeshwari
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి పురంధేశ్వరిని మంత్రివర్గం నుండి తప్పించి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న పలువురి నిర్ణయాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఆదివారం(అక్టోబర్ 28) రోజున కేంద్రమంత్రి వర్గ విస్తరణ జరిగనున్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈసారి భారీగా మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రానికి చెందిన పురంధేశ్వరిని తప్పించి ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించాలని పలువురు సూచించారట.

అయితే అందుకు మన్మోహన్ సింగ్ ససేమీరా అన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆమె మానవవనరుల శాఖకు సహాయమంత్రిగా ఉన్నారు. ఈసారి ఆమెకు సదరు శాఖకు మంత్రిగా చేయాలని మన్మోహన్ సింగ్ భావిస్తున్నారట. ఆమె సామర్థ్యాన్ని గుర్తించిన మన్మోహన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

కేంద్రమంత్రి పల్లంరాజు అంశంపై కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి పర్యాటక శాఖను అప్పగించేందుకు ప్రధాని ఓకే చెప్పారని సమాచారం. తెలంగాణ నుండి సర్వే సత్యనారాయణ, వి హనుమంత రావు, అంజన్ కుమార్ యాదవ్‌, రేణుకా చౌదరిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సర్వే, విహెచ్‌లకు దాదాపు ఖరారైనట్లుగా సమాచారం.

కేంద్రంలో యువతకే పెద్ద పీట వేయాలని అందరూ భావిస్తున్నారు. రాహుల్ గాంధీ జట్టుకు పెద్ద పీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు సహాయమంత్రిగా ఉన్న పలువురు యువనేతలను మంత్రులుగా ప్రమోట్ చేయనున్నారని సమాచారం. బేణి ప్రసాద్ వర్మ తదితరులకు ఉద్వాసన పలకనున్నట్లుగా తెలుస్తోంది.

English summary
PM Manmohan Singh has rejected some leaders opinion on central minister Purandeshwari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X