వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులపై విచారణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Devegowda-SM Krishna
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ - మైసూరు మధ్య నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కోసం నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజెస్ (నైస్)కు భూమి కేటాయించిన వ్యవహారంలో ప్రత్యేక లోకాయుక్త కోర్టు ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులపై విచారణకు ఆదేశించింది. హెచ్‌డి దేవెగౌడ, ఎస్ఎం కృష్ణ, యడ్యూరప్పలపై విచారణకు కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది.

భూకేటాయింపు వ్యవహారంలో మాజీ మంత్రులు ఆర్‌వి దేశ్‌పాండే, డికె శివకుమార్, నైస్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ ఖేనీలపై కూడా లోకాయుక్త కోర్టు విచారణకు ఆదేశించింది. బెంగళూర్ మైసూరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ రింగ్ రోడ్డును వాడుతున్న వాహనాల నుంచి వసూలు చేసిన టోల్‌ను జప్తు చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సామాజిక కార్యకర్త టిజె అబ్రహం తన ఫిర్యాదులో 102 మందిని పేర్కొనగా, కోర్టు ఆదేశాల్లో 30 మంది చోటు చేసుకున్నారు. విచారణ బృందానికి లోకాయుక్త పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ హెచ్ఎన్ఎస్ రావు నేతృత్వం వహిస్తారు. నలుగురు డిప్యూటీ సూపరింటిండెంట్లు సహకరిస్తారు. నైస్‌కు చెందిన రెండు భవనాలను కూడా జప్తు చేస్తారు.

కోర్టు ఆదేశాలను అధ్యయనం చేసిన తర్వాత న్యాయం కోసం పైకోర్టుకు వెళ్తామని నైస్ ప్రతినిధి చెప్పారు. ఫిర్యాదు ప్రకారం - ఎక్స్‌ప్రెస్ వే కోసం రైతుల నుంచి భూములు సేకరించారు. దానికితోడు 1,913 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయించారు. ముప్పయి ఏళ్ల లీజుకు కేవలం ఏడాడికి పది ఎకరాలకు మాత్రమే నైస్ లీజు చెల్లించే విధంగా ఉంది.

విచారణను ఎదుర్కునే దేవెగౌడ భారత ప్రధానిగా కూడా పనిచేశారు. ఎస్ఎం కృష్ణ శుక్రవారం నాడే విదేశీ వ్యవహారాల మంత్రిగా రాజీనామా చేశారు. మరో మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప బిజెపికి రాజీనామా చేసి కొత్త పార్టీని స్థాపించే ప్రయత్నంలో ఉన్నారు.

English summary
Karnataka Lokayukta police will look into the role of former Prime Minister HD Devegowda and External Affairs Minister SM Krishna in the acquisition of land from farmers for the Bangalore-Mysore Expressway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X