వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ రాజీనామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

SM Krishna
న్యూఢిల్లీ: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ శుక్రవారం రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఆదివారం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జోరుగా ఉహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎస్ఎం కృష్ణ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విస్తరణకు రెండు రోజుల ముందు ఎస్ఎం కృష్ణ రాజీనామా చేయడం గమనార్హం. ఇతను తన లావోస్ పర్యటనను కూడా రద్దు చేసుకొని రాజీనామాను సమర్పించారు.

ఎస్ఎం కృష్ణ స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వడంతో పాటు, అతనికి కర్నాటక కాంగ్రెసు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వస్తున్నాయి. అందుకే అతను లావోస్‌లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నప్పటికీ దానిని రద్దు చేసుకొని రాజీనామాను సమర్పించినట్లుగా తెలుస్తోంది.

అయితే ఎస్ఎం కృష్ణ రాజీనామా చేశారనే విషయం ఖచ్చితంగా తెలియడం లేదు. కర్నాటక కాంగ్రెసు బాధ్యతలు అప్పగించడంతో పాటు మైసూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగానే రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ భేటీ కానుంది. ఈ సమయంలో మరికొందరు కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఇక రాష్ట్రం విషయానికి వస్తే.. చిరంజీవి పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది. కేంద్రమంత్రి పురంధేశ్వరికి ప్రమోషన్ ఇవ్వనున్నారు. రేణుకా చౌదరి, సర్వే సత్యనారాయణ, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిల పేర్లను పరిశీలిస్తున్నారు. రేణుక లేదా కోట్లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కనుందని ఢిల్లీలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

English summary
External Affairs Minister SM Krishna has resigned from the Cabinet, sources have told NDTV. His resignation comes just two days before an anticipated cabinet reshuffle. This will also open up his berth for a new face to be brought in. It is not yet known who that might be.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X