వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాకు పాదాభివందనం చేసిన బలరాం, కృపారాణి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balaram Naik - Krupa Rani
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన బలరాం నాయక్, కిల్లి కృపారాణీలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి పాదాభివందనం చేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం బలరాం నాయక్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సోనియా, రాహుల్ వద్దకు వెళ్లి వారిద్దరికి పాదాభివందనం చేశారు. దీంతో వారు లేచి అతనిని ఆశీర్వదించారు. కృపారాణి కూడా ప్రమాణానంతరం సోనియాకు పాదాభివందనం చేశారు.

కాగా చిరంజీవికి పర్యాటక శాఖను, మనీష్ తివారికి సమాచారం శాఖను స్వతంత్ర హోదాలో ఇచ్చే అవకాశముంది. విదేశాంగ శాఖ మంత్రిగా సల్మాన్ ఖుర్షీద్, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రిగా అజయ్ మాకెన్, పెట్రోలియం శాఖ మంత్రిగా వీరప్ప మొయిలీలను నియమించనున్నారు. జైపాల్ రెడ్డికి సైన్స్ అండ్ టెక్నాలజీ, పల్లం రాజుకు హెచ్ఆర్‌డి, అశ్విన్ కుమార్‌కు న్యాయశాఖను, జ్యోతిరాధిత్య సింధియాకు విద్యుత్, కపిల్ సిబాల్‌కు టెలికాం, పవన్ కుమార్ బన్సాల్‌కు రైల్వే, హరీష్ రావత్‌కు ఆరోగ్యం, అశ్విన్ కుమార్‌కు న్యాయశాఖ, జ్యోతి మిర్దాకు గిరిజన శాఖ, దీప్ దాస్ మున్షీకి సాంస్కృతిక శాఖ, ఆర్పీఎన్ సింగ్‌కు హోంశాఖ సహాయం, రెహ్మాన్ ఖాన్‌‌కు మైనార్టీ వ్యవహారాలను, కమల్ నాథ్‌కు పార్లమెంటరీ వ్యవహారాలు అప్పగింటే అవకాశాలు కనిపిస్తున్నాయి

ప్రమాణ స్వీకారం చేసిన వారిలో... పల్లం రాజు, చిరంజీవి, కిల్లి కృపారాణి, సర్వే సత్యనారాయణ, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, బలరాం నాయక్, రెహ్మన్ ఖాన్, అజయ్ మాకెన్, అశ్విన్ కుమార్, హరీష్ రావత్, చంద్రేష్ కుమారి, శశిథరూర్, సురేష్, తారిఖ్ చౌదరి, రంజన్ చౌదరి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.

English summary
PM Manmohan Singh has reshuffled his Cabinet in a bid to overhaul his government's image ahead of General Elections in 2014. Seven new ministers and 15 junior ministers took the oath of office on Sunday at a brief ceremony to mark the changes aimed at bringing in younger faces into the Cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X