వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫార్ములా వన్ గ్రాండ్ ఫ్రీ విజేత వెటెల్: 21వ స్థానంలో కార్తికేయన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karthikeyan
న్యూఢిల్లీ: ఇండియన్ పార్ములా వన్ గ్రాండ్ ఫ్రీ రేసు గ్రేటర్ నోయిడాలో ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. గ్రాండ్ ఫ్రీ టైటిల్ సెబాస్టియన్ వెటెల్ దక్కించుకుంది. రెండో స్థానంలో ఫెర్నాండో అలొన్సో, మూడో స్థానంలో మార్క్ వెబర్, నాలుగో స్థానంలో లెవిస్ హామిల్టన్, ఐదో స్థానంలో జెన్సన్ బటన్ నిలిచింది. వెటెల్ వరుసగా రెండోసారి టైటిల్ సొంతం చేసుకుంది.

ఫోర్స్ ఇండియా రేసర్లు హాల్ కెన్ బర్క్ 8వ స్థానంలో, పాల్ డీ రెస్టాలు 12వ స్థానంలో నిలిచారు. నారాయణ కార్తికేయన్ 21వ స్థానంలో నిలిచారు. నోయిడాలోని బుద్ధ సర్క్యూట్ ఈ రేస్‌కు వేదిక అయింది. ఛాంపియన్ రేసర్‌లు సెబాస్టియన్ వెటెల్, ఫెర్నాండో ఆలాన్సోల మధ్య ఉత్కంఠ పోరు జరుగుతోందని అందరూ భావించారు. అదే జరిగింది.

కాగా అంతకుముందు భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఫార్ములా వన్ రేసు నిర్వహించడం గర్వంగా ఉందని, ఫార్ములా వన్ రేసులో ఫెరారీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫెరారీ అతిథిగా ఇటలీ జట్టు గ్యారోజీలే హర్భజన్ కాసేపు గడిపారు. ఫెరారీ అంటే తనకు ఎంతో అభిమానమని, అలోన్సో అంటే ఇష్టమని చెప్పారు.

English summary
Red Bull's Sebastian Vettel won today's Indian Grand Prix, his forth straight victory this season, to extend his Formula One Championship leade over Ferrari's Fernando to 13 points.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X