వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా వల్లే ఆమెకు మంత్రి పదవి రాలేదు: బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: తన వల్లనే పార్లమెంటు సభ్యురాలైన తన భార్య బొత్స ఝాన్సీకి కేంద్ర మంత్రి పదవి రాలేదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. తాను పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా ఉండడం వల్ల ఝాన్సీకి కేంద్ర మంత్రి పదవి రాలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మంత్రి వర్గ మార్పుల్లో చిన్నపాటి సమస్యలున్నా సర్దుకుంటాయని అన్నారు. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రానికి ఇతోధిక ప్రాధాన్యం ఇచ్చినందుకు ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞలు చెప్పారు.

ఏ శాఖ అప్పగించినా ఎస్ జైపాల్ రెడ్డి సమర్థంగా నిర్వహిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. జైపాల్ రెడ్డి శాఖ మార్పు ప్రమోషనో, డిమోషనో తనకు తెలియదని బొత్స అన్నారు. ఏ ఒక్కరి వల్ల ప్రభుత్వం, పార్టీ నడవవని కేంద్ర మంత్రి చిరంజీవిపై మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు సమాధానంగా అన్నారు. సున్నా పక్కన ఒక్కటి ఉంటేనే విలువ అని, అందరూ కలిసి ఉంటేనే పార్టీకి బలమని ఆయన అన్నారు. ఎవరు నాయకత్వం వహించినా అందరూ కలిసి ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని అన్నారు.

అవకాశం వస్తే చిరంజీవి పార్టీకి నాయకత్వం వహిస్తారని ఆయన అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే శానససభ్యులు పార్టీ మారుతున్నారని చింతలపూడి శానససభ్యుడు మద్దాల రాజేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడంపై అన్నారు. మరి కొంత మంది వెళ్లినా తమ ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని దీమా వ్యక్తం చేశారు. అవసరమనుకుంటే రాష్ట్రంలో కూడా మార్పులు చేస్తామని ఆయన చెప్పారు

రాజీనామా ఉపసంహరించుకోవాలని తాము ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావును కోరినట్లు ఆయన తెలిపారు. కావూరి మంత్రి పదవిని కోరుకోవడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. కావూరి సేవలను పార్టీకి వాడుకుంటామని చెప్పారు. పార్టీలో పనిచేసే వారికే పదవులు లభిస్తాయని ఆయన అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో మరి కొంత మంది బిసీలకు స్థానం కల్పించాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

కేంద్ర మంత్రివర్గంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ చేరితే బాగుండేదని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర మంత్రులు పనిచేయాలని అన్నారు. మంత్రులుగా అందరికీ అవకాశం రాదని, చిన్నపాటి అసంతృప్తులు సహజమేనని అన్నారు.

English summary

 PCC president Botsa Satyanarayana told that due to him only his wife Botsa Jhansi was not inducted into PM Manmohan Singh's cabinet. Hesaid that he could say on S Jaipal Reddy's portfolio change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X