• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షర్మిల సీరియస్ కాదు, బాబుకు పిచ్చి: తులసిరెడ్డి

By Pratap
|

Tulasi Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్రపై మాట్లాడడానికి కాంగ్రెసు అధికార ప్రతినిధి తులసిరెడ్డి నికారించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షర్మిల పాదయాత్రను తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గాంధీ భవన్ నుంచి షర్మిల పాదయాత్రపై వ్యాఖ్యలు చేయలేమని ఆయన అన్నారు.

చంద్రబాబుకు సంతకాలు పిచ్చి పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వస్తే తొలి సంతకం, మలి సంతకం, మూడో సంతకం అంటూ హామీలు ఇస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఏయే ఫైళ్లపై వరుసగా ఆ మూడు సంతకాలు చేస్తానని చెప్పారో వాటిని ఆయన గుర్తు చేశారు. బీసీలపై మక్కువ ఉంటే చంద్రబాబు పార్టీ అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇవ్వాలని ఆయన అన్నారు.

తమ పార్టీ బొత్స సత్యనారాయణకు పిసిసి అధ్యక్ష పదవిని ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వంద హామీలు ఇచ్చినా చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల అని ఆయన అన్నారు. చంద్రబాబును ప్రజలు విశ్వసించడం లేదని ఆయన అన్నారు. పడమట సూర్యుడు ఉదయించడం ఎంత అసంభవమో, చంద్రబాబు అధికారంలోకి రావడం అంతే అసంభవమని ఆయన అన్నారు.

రెడ్డి సామాజిక వర్గానికి కేంద్ర మంత్రి వర్గంలో అన్యాయం జరిగిందనే మాటలో నిజం లేదని కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే జైపాల్ రెడ్డి మంత్రివర్గంలో ఉండగా, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కొత్తగా తీసుకోవడం సంతోషించదగిన విషయమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కావూరి సాంబశివ రావుకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు.

English summary
PCC spokes person Tulasi Reddy said that they are not taking YSR Congress party president YS Jagan's sister Sharmila padayatra serious. He lashed out at Telugudesam president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X