వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవ్వాల్సింది కేంద్రమే: తెలంగాణపై వైయస్ విజయమ్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
భువనగిరి: రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. కానీ తెలంగాణలో రావణకాష్టం రాజేశారని ఆమె అన్నారు. యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన సందర్భంగా నల్లగొండ జిల్లా భువనగిరిలో సోమవారం సాయంత్రం ఏర్పాటైన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

తెలంగాణలో అనేక మరణించారని, తెలంగాణలోని మరణాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె అన్నారు. ప్రాణాలు పోయేంత వరకు తెలంగాణను వైయస్ రాజశేఖర రెడ్డి ప్రేమించారని చెప్పారు. ఇక్కడి కష్టాలు వైయస్ రాజశేఖర రెడ్డికి తెలుసునని, తెలంగాణ వెనుకబాటును గుర్తించారని ఆమె అన్నారు. ఈ ప్రాంతానికి చేయాల్సినంత వైయస్ రాజశేఖర రెడ్డి చేశారని అన్నారు. రాజశేఖర రెడ్డికైనా, వైయస్ జగన్‌కైనా తెలంగాణ పట్ల వ్యతిరేకత లేదని విజయమ్మ అన్నారు.

మనిషిని మనిషిగా ప్రేమించడమే వైయస్ రాజశేఖర రెడ్డి నేర్పించారని, అందరూ కలిసి ఉండాలని ఆశించారని, ఎవరినీ నొప్పించే ఉద్దేశం వైయస్‌కు లేదని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తామని చెప్పారు. అందుకే తెలంగాణ కోసం రాజీనామాలు చేసినవారిపై తమ పార్టీ పోటీ పెట్టలేదని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇచ్చే తాము పోటీ పెట్టలేదని అన్నారు.

తాము తెలంగాణకు వ్యతిరేకులం కాదని పార్టీ ప్లీనరీలో కూాడ స్పష్టం చేశామని అన్నారు. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బ తినకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ఎవరో చేసిన పాపాలను దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై వేస్తున్నారని నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. వైయస్ జగన్ కడపలో భారీ మెజారిటీతో గెలిచారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీదే అధికారమని ఆయన అన్నారు.

English summary
YSR Congress honorary president YS Vijayamma said that centre should give Telangana according the article 3. She said that YSR Congress is not against Telangana. Yuva Telangana convenor Jitta Balakrishna Reddy joined in YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X