వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైపాల్ రెడ్డి శాఖ మార్పు వెనక రిలయన్స్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Jaipal Reddy
హైదరాబాద్‌: కేజీ బేసిన్‌లోని రిలయన్స్‌ గ్యాస్‌ క్షేత్రాలను కెలికినందుకే కేంద్ర మంత్రి జెైపాల్‌రెడ్డి శాఖ మారిందనే వార్తలు వస్తున్నాయి. అందువల్లనే ఆయనను పెట్రోలియం శాఖ నుంచి తప్పించారని అంటున్నారు. ఆయనకు ప్రధాని మన్మోహన్ సింగ్ శాస్త్ర, సాంకేతిక శాఖను కేటాయించారు. పెట్రోలియం రంగంలో జైపాల్ రెడ్డి వల్ల రిలయన్స్ అధిపత్యానికి తెర పడినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను అడ్డుకుంటున్న జైపాల్ రెడ్డిని తప్పించడమే ధ్యేయంగా ముఖేష్‌ అంబానీ గత కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్ని స్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.

మురళీదేవరా నుంచి 2011 జనవరిలో పెట్రోలియం శాఖ జెైపాల్‌రెడ్డి చేతికి వచ్చింది. అప్పటి నుంచే కేజీ బేసిన్‌లోని గ్యాస్‌ ధరను పెంచాలని అంబానీ ఒత్తిడి తెస్తున్నారు. దీన్ని జెైపాల్‌ తిరస్కరించడంతో మంత్రుల సాధికార బృందంపై, సోనియా, మన్మోహన్‌లపెై కూడా అంబానీ ఒత్తిడి తెచ్చారని అంటారు. తన డిమాండ్‌ నెరవేర్చుకునే వ్యూహంలో బాగంగా గ్యాస్‌ ఉత్పత్తిని సాంకేతిక కారణాలు చూపుతూ తగ్గించారన్న విమర్శలు అధికారుల నుంచి వినిపించాయి. దీంతో గ్యాస్‌ ధర పెంచడం పక్కనబెట్టి అసలు డి6 గ్యాస్‌క్షేత్రంపై కాగ్‌తో ఆడిటింగ్‌ జరిపించాలని జెైపాల్‌రెడ్డి నిర్ణయించారు.

నిబంధనల ప్రకారం గ్యాస్‌ ఉత్పత్తి కాకపోగా, పెట్టుబడులు, ఇతర వ్యయాలను ఎక్కువగా చూపినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగ్‌తో ఆడిటింగ్‌ నిర్ణయాన్ని రిలయన్స్ అడ్డుకుందని అంటున్నారు. ప్రైవేటు సంస్థను కాగ్‌తో ఆడిటింగ్‌ చేయాల్సిన అవసరం లేదని చెప్పగా, ప్రభుత్వం అవసరమైతే రెండోసారి ఆడిటింగ్‌ చేయించుకోవచ్చని నిబంధనలను చూపుతూ కాగ్‌ ఆడిటింగ్‌కే జెైపాల్‌ రెడ్డి కట్టుబడ్డారు. దీంతో అసలుకే ఎసరు పడుతుందని గమనించిన ముఖేష్‌ అంబానీ అప్రమత్తయ్యార ని, జెైపాల్‌ నుంచి పెట్రోలియం శాఖను తప్పించడానికి తీవ్రయత్నాలు చేసి విజయం సాధించారని తెలుస్తోందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

మీడియా వార్తాకథనాల ప్రకారం - మంత్రుల సాధికార బృందం నిర్ణయం మేరకు గ్యాస్‌ ధరను 2014 ఏప్రిల్‌లోసవరించాలి. అయితే 2010 మార్చిలో 54 మిలియన్‌ మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్లు రోజుకు(ఎంఎంఎస్‌సిఎండి) గ్యాస్‌ ఉత్పత్తి చేశారు. 2011-12లో 70 ఎంఎంఎస్‌సిఎండి ఉత్పత్తి చేయాల్సి ఉండగా, దీన్ని 42కే పరిమితం చేసారు. 2012-13లో 80 ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, కేవలం 25కే పరిమితం చేశారు. అనుకున్న స్థాయిలో గ్యాస్‌ నిక్షేపాలు లేవని, అందుకే ఉత్పత్తి తగ్గుతోందని రిలయన్స్ చెబుతోంది.

అయితే గ్యాస్‌ ఉత్పత్తిలో తగ్గుదలతో దేశవ్యాప్తంగా వేలకోట్ల రూపాయల నష్టం జరుగుతోంది. 1 ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ తగ్గితే సుమారుగా 210 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని నష్టపోవాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 20,000 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో ప్లాంట్లను నిర్మించారు. కేటాయింపుల మేరకు గ్యాస్‌ రాకపోవడంతో విద్యుత్‌ నష్టపోయి, పారిశ్రామికవేత్తలు, ప్రజలు, ప్రభుత్వం కూడా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది.

English summary
According to media reports - Reliance has played the role in changing S Jaipal Reddy's portfolio. It is said that Reliance is unhappy with Jaipal Reddy's attitude regarding KG basin gas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X