వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయమ్మకు ఉమ ప్రశ్న: జగన్‌పార్టీతో భేటీపై ఎమ్మెల్యే

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
నల్గొండ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నల్గొండ జిల్లా ఎమ్మెల్యే ఉమా మాధవ రెడ్డి మంగళవారం స్పందించారు. విజయమ్మ నిన్న భువనగిరిలో మాట్లాడిన విషయం తెలిసిందే. జిల్లాకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఆమె వ్యాఖ్యలను ఉమా మాధవ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

నల్గొండ జిల్లాకు ఎవరు ఎంత మేలు చేశారో విజయమ్మ తెలుసుకోవాలని సూచించారు. జిల్లా రైతులకు తెలుగుదేశం పార్టీ హయాంలో మోటార్లతో నీటిని సరఫరా చేశామన్నారు. నిత్యం విశ్వసనీయత అంటున్న విజయమ్మకు ఆ పదం అర్థం ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. విశ్వసనీయతకు అర్థం తెలుసుకొని మాట్లాడాలన్నారు.

కడప జిల్లా, నల్గొండ జిల్లాలో రిమ్స్‌కు ఒకేరోజు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో శంకుస్థాపన జరిగిందని, కడప జిల్లా రిమ్స్ పూర్తయినప్పటికీ ఇక్కడి రిమ్మస్ ఇంతవరకు పూర్తి కాలేదన్నారు. నల్గొండ జిల్లాకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తి న్యాయం జరిగిందన్నారు.

భేటీ లేదు.. చందర రావు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను తన తనయుడు కలిశారనడంలో ఎలాంటి వాస్తవం లేదని కోదాడ ఎమ్మెల్యే చందర్ రావు వేరుగా అన్నారు. తమను అభాసుపాలు చేసేందుకే ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. కొందరు ప్రలోభాలకు లొంగి పార్టీలు మారుతున్నారని విమర్శించారు. కాని తాను ఎప్పటికీ టిడిపిలోనే ఉంటానని చెప్పారు.

English summary
Telugudesam Party Nalgonda district MLA Uma Madhava Reddy has questioned YSR Congress party honorary president YS Vijayamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X