వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి, తమిళనాడుకు పొంచి ఉన్న నీలం రంగు తుఫాను

By Srinivas
|
Google Oneindia TeluguNews

Cyclonic storm likely to intensify in Tamil Nadu, Andhra Pradesh today
హైదరాబాద్/చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడుతోంది. దీంతో నీలం రంగు తుఫాను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. చెన్నైకి ఆగ్నేయ దిశగా 400 కిలోమీటర్ల దూరంలో వాయుగుంటం కేంద్రీకృతమైంది. ఇది తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతం కల్లోలంగా మారింది. కడలూరు, రామేశ్వరం, తదితర ప్రాంతాలలో మొదటి విడత ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

మత్సకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని తీర ప్రాంత జిల్లా అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్సకారులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తుఫాను వల్ల ఎక్కడ పంట దెబ్బతింటుంతో అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. కొత్తపట్నంలో 10 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశముంది. 24 నుండి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

తమిళనాడు, శ్రీలంకలపై ఈ ప్రభావం ఎక్కువగా పడే అవకాశముంది. తుఫాను పొంచి ఉండటంతో తమిళనాడులోని తీర ప్రాంతాల్లో విద్యాసంస్థలు తదితరాలను బంద్ చేశారు. నెల్లూరు - నాగపట్నం మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశముంది. తీరం వెంబటి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గుంటూరు, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది. నెల్లూరు జిల్లాలో అధికారులను అప్రమత్తం చేశారు.

కృష్ణపట్నం, మచిలీపట్నం, నాగపట్నం, ఓడరేవు తీరాల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కాగా వివిధ ప్రాంతాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఈ నెల 31వ తేది సాయంత్రానికి ఉత్తర తమిళనాడు-దక్షిణాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలోని తీరప్రాంత మండలాల అధికారులన్ని అఫ్రమత్తం చేశారు.

నీలం తుఫాను ప్రభావం మన రాష్ట్రంలో కంటే తమిళనాడులోనే ఎక్కువగా ఉంటుందని, మనం భయపడాల్సినంత తీవ్రరూపంలో ఉండదని మంత్రి రఘువీరా రెడ్డి మధ్యాహ్నం చెప్పారు. అయినప్పటికీ ఆయా ప్రాంతాలలో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసిందన్నారు. చేపల వేటకు వెళ్లవద్దని మత్సకారులను కోరామన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. సచివాలయంలో టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయని చెప్పారు. 040-23456005, 23451043 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని చెప్పారు. ఆయా జిల్లాల్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కంట్రోల్ రూం నెంబర్లు 23308585, 23376256.

English summary
After the alert by met office on Monday regarding cyclone threats in Tamil Nadu, Andhra Pradesh and Puducherry, authorities in Chennai have closed all schools as a precautionary measure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X