వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రాన్ని తాకిన తుఫానులు, ప్రభుత్వాలు కొయ్యగుర్రాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

రాష్ట్రాన్ని ఎప్పటికప్పుడు తుఫానులు తాకుతూనే ఉన్నాయి. 1977 తుఫాను కనీవినీ ఎరుగని విధ్వంసాన్ని రాష్ట్రానికి చూపించింది. ఈ తుఫాను వల్ల పెద్ద యెత్తున నష్టం వాటిల్లింది. ఈ తుఫాను ప్రభావంతోనే ప్రముఖ కవి నగ్నముని కొయ్యగుర్రం అనే దీర్ఘ కావ్యం రాశారు. ప్రజలు కష్టాలు పడుతుంటే ప్రభుత్వాలు కొయ్యగుర్రంలా కదులుతున్నట్లు కనిపిస్తూనే ఎలా స్తబ్దంగా ఉన్నాయో కవి ఎత్తి చూపారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని నీలం తుఫాను వణికిస్తోది.

నీలం తుఫాను

నీలం తుఫాను

ప్రస్తుతం నీలం తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భయపెడుతోంది. దీనికి రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా వణికిపోతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను నెల్లూరుకు సమీపంగా వస్తోంది. ఇది కలిగించే నష్టం ఎలా ఉంటుందో చూడాల్సిందే.

లైలా తుఫాను

లైలా తుఫాను

ఈ తుఫానుకు పాకిస్తాన్ ఆ పేరు పెట్టింది. 1990 తర్వాత అగ్నేయ భారతాన్ని తాకిన తుఫాను ఇదే. 2010 మే 17వ తేదీన ఈ తుఫాను ప్రారంభమైంది. మే 19వ తేదీన ఇది ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని తాకింది. ఇది రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింది. లైలా అనేది అరబిక్ పేరు. దాని అర్థం రాత్రి అని. గత 14 ఏళ్ల తర్వాత పెద్ద యెత్తున రాష్ట్రాన్ని తుఫాను ఇదే. ఈ తుఫాను వల్ల రాష్ట్రంలో 36 మంది మరణించినట్లు ఓ అంచనా. కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలను ఈ తుఫాను భయపెట్టింది. ఆ తుఫానులో ఒంగోలు తీవ్రంగా నష్టపోయింది.

1990 తుఫాను

1990 తుఫాను

ఈ తుఫాను రాష్ట్రంలో బీభత్సం సృష్టించింది. 1990 మే మాసంలో ఈ తుఫాను రాష్ట్రాన్ని తాకింది. మే 8వ తేదీ నాటికి ఇది సూపర్ సైక్లోన్‌గా మారింది. ఇందులో 967 మంది మరణించినట్లు లెక్కలు వేశారు. లక్షకు పైగా పశుసంపద ప్రాణాలు కోల్పోయింది.

1977 తుఫాను

1977 తుఫాను

ఈ తుఫాను రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపింది. 1977 నవంబర్ నెలలో రాష్ట్రాన్ని ఈ తుఫాను తాకింది. 14,204 మంది మరణించినట్లు అంచనా వేశారు. దివిసీమ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. కృష్ణా డెల్టా తీవ్రంగా దెబ్బ తిన్నది. బాపట్లలో చర్చిలో తలదాచుకున్న వంద మంది భవనం కూలిపోవడం మృత్యువాత పడడం అత్యంత విషాదకరమైన సంఘటన. అవనిగడ్డలో ఈ తుఫాను స్మారకాన్ని ఏర్పాటు చేశారు.

రాష్ట్రాన్ని తుఫాను తాకడం ఇదే చివరి సారి అనుకోవడానికి లేదు. ప్రకృతి ఆగ్రహావేశాలకు గురై సముద్రం ఉప్పొంగి నేల మీది ప్రాణులపై విరుచుకుపడుతుంది. దాని ప్రభావాన్ని ముందు అంచనా వేయడానికి వీలు ఉన్నప్పటికీ తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.

English summary
Severe cyclonic storm 'Nilam' on Wednesday evening reached closer to the coasts of Tamil Nadu and Andhra Pradesh amid warnings from the weather department of extensive damage to huts, standing crops and power lines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X