హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పిన నీలం తుఫాను గండం: మేలేనన్న రఘువీరా

By Pratap
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
హైదరాబాద్: రాష్టానికి నీలం తుఫాను గండం తప్పింది. మహాబలిపురం వద్ద తుఫాను తీరాన్ని దాటింది. చెన్నైకి కూడా తుఫాను ముప్పు తప్పింది. తుఫాను తీరాన్ని దాటిన సమయంలో మహాబలిపురం వద్ద గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. మహాబలిపురం వద్ద దాదాపు 4వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన నష్టం వాటిల్లలేదు.

నీలం తుఫానుపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి బుధవారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ తుఫాను వల్ల రాష్ట్రానికి మేలే జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 61 మండలాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. తుపాను వల్ల ఏ విధమైన ముప్పు లేదని చెప్పారు.

తుఫాను ప్రభావంతో ఇప్పటి వరకు కురిసిన వర్షాల వల్ల రైతులకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని రఘువీరా రెడ్డి అన్నారు. తుఫాను సహాయక చర్యల్లో భాగంగా 47 మంది జాతీయ విపత్తు స్పందన బృంద సభ్యులను నెల్లూరుకు పంపినట్లు తెలిపారు. చిత్తూరు, నెల్లుూరు జిల్లాల్లో గతంలో పనిచేసిన సీనియర్ ఐఎఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా పంపించినట్లు ఆయన తెలిపారు.

రవిచంద్రన్‌ను చిత్తూరు జిల్లాకు, రాజశేఖర్‌ను నెల్లూరు జిల్లాకు, వల్లవన్‌ను ప్రకాశం జిల్లాకు ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు రఘువీరా రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి పంట నష్టం జరగలేదని చెప్పారు.

నీలం తుఫాను వల్ల తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చెన్నై నగరంలోని పలు పల్లపు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. దాన్ని తోడివేసేందుకు జనరేటర్లు వాడుతున్నారు.

English summary
Andhra Pradesh has escaped from Nilam cyclone. No devastation is reported. Revenue minister Raghuveera Reddy said that state is benefited with the Nilam cyclone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X