ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పార్టీలో చేరుతున్నా, పొమ్మనలేకే: ఎమ్మెల్యే వనిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vanitha
ఏలూరు: తెలుగుదేశం పార్టీ తనకు పొమ్మనలేక పొగ పెట్టిందని పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వనిత బుధవారం అన్నారు. తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. టిడిపి తనను పార్టీ నుండి పంపించేందుకు పొమ్మనలేక పొగ పెట్టారన్నారు. త్వరలో తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు చెప్పారు. నవంబర్ 4వ తేదిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరతానని చెప్పారు.

తనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించినందుకే టిడిపి తనను ఏకంగా పార్టీ నుండి సస్పెండ్ చేసిందని వాపోయారు. తన సొంత నియోజకవర్గంలోనే టిడిపి తనను టార్గెట్ చేస్తోందని, తన స్థానంలో మరొకరిని ప్రోత్సహిస్తుండటంతో మనస్తాపానికి గురయ్యానన్నారు. మహిళా ఎమ్మెల్యే అయినా తాను పార్టీ చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నానని చెప్పారు. పార్టీ విధానాలను ప్రశ్నించిన వారందరినీ వదిలించుకుంటున్నట్లుగా కనిపిస్తోందన్నారు.

కాగా వనిత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడారని చెబుతూ టిడిపి ఆమెను పార్టీ నుండి బహిష్కరించిన విషయం తెలిసిందే.
జగన్ వైపుకు వెళ్లేందుకే వనిత విమర్శలు చేస్తోందని భావించిన పార్టీయే ముందుగా స్పందించి ఆమెను తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరించిందని చెబుతున్నారు. మరోవైపు నాలుగు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన వనిత.. తన నిర్ణయాన్ని వచ్చే నెల 4వ తేదీన ప్రకటిస్తానని చెప్పారు.

English summary

 West Godavari district Gopalapuram MLA Vanitha said she will join in YSR Congress party on November 4th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X