వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూసుకొస్తున్న నీలం: అప్రమత్తమైన ఎపి, తమిళనాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Cyclone alert issued in Tamil Nadu, Andhra Pradesh
హైదరాబాద్/చెన్నై: నీలం తుఫాను దూసుకొస్తుండటంతో తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఎపి కంటే తమిళనాడుకు నీలం తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏ క్షణమైనా నీలం తుఫాను వస్తుందన్న నేపథ్యంలో తమిళనాడులో సాగర తీరంలోని 14 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. చెన్నై ఓడరేవులో ఏడో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.

చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. 14 జిల్లాల్లో విద్యాసంస్థలు బంద్ అయ్యాయి. పలు కార్యాలయాలు మూతపడ్డాయి. నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి నీలం తుఫాను అని నామకరణం చేశారు. ఇది నెల్లూరు - కడలూరు వద్ద ఈ రోజు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల మధ్య తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నీలం తుఫాను ప్రభావం ప్రధానంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాపై పడనుంది. గుంటూరు పైన పడుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే గుంటూరుకు తుఫాను ముప్పు లేదని, ప్రజలు భయానికి లోను కావద్దని అధికారులు చెబుతున్నారు. నిజాంపట్నం ఓడరేవులో నీటిమట్టం క్రమంగా పెరుగుతుండగా, మచిలీపట్నం వద్ద సముద్రం 200 మీటర్ల ముందుకు వచ్చింది.

నీలం తుఫాను కారణంగా అధికారులు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. వాడలరేవు సమీపంలో 12 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. వారిని రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం నీలం తుఫాను చెన్నైకి ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రకాశం జిల్లా ఓడరేవులో ఏడో ప్రమాదం హెచ్చరిక, కొత్తపట్నంలో ఐదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరికొన్ని పోర్టుల్లో ఆరో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

నీలం తుఫాను ప్రభావంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల, తిరుపతిలో ఉదయం నుంచి జోరుగా కురుస్తున్న వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

English summary
The deep depression which had formed in the Bay of Bengal has intensified into a cyclone. The cyclone, which has been named Nilam, will cross Kadaloor and Nellore (South Andhra Pradesh) today evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X