హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సారీ చెప్పు:దేనికైనారెడీపై మోహన్‌‌బాబుకు ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mohan Babu
హైదరాబాద్/విజయవాడ: కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై విమర్శల దాడి పెరుగుతోంది. ఆయన తనయుడు మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ చిత్రం వివాదంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. తమను అవమానించేలా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయంటూ బ్రాహ్మణ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. వారికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుండి మద్దతు లభిస్తోంది.

కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు మోహన్ బాబు పైన మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బ్రాహ్మణులపై మోహన్ బాబు గార్డ్సు రౌడీయిజం చేయడం దురదృష్టకరమన్నారు. సినిమాలో ఉన్న అభ్యంతరకర సీన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణులపై దాడి చేసినందుకు మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

శాంతియుతంగా ఆందోళన చేస్తున్న బ్రాహ్మణులపై మోహన్ బాబు గార్డ్సు దాడి చేయడం పాశవిక చర్య అని మెదక్ జిల్లాలో ఫరూక్ హుస్సేన్ అన్నారు. కాగా బ్రాహ్మణుల ఆందోళనకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ఈ రోజు పలువురు బ్రాహ్మణులు ఫిర్యాదు చేసేందుకు హెచ్చార్సీకి వెళ్లారు. అప్పుడు అక్కడకు విష్ణు వచ్చారు. అదే సమయంలో డిఎస్పీ సివిల్ డ్రెస్‌లో వచ్చారు.

ఈ సమయంలో బ్రాహ్మణులకు మద్దతుగా ఆందోళన నిర్వహిస్తున్న పలువురు న్యాయవాదులు సివిల్ డ్రెస్‌లో ఉన్న డిఎస్పీ హీరో విష్ణుకు చెందిన వ్యక్తిగా భావించి నిలదీసే ప్రయత్నం చేశారు. పోలీసులు వారి చర్యలను అడ్డుకున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలో మోహన్ బాబు, మరో ఐదుగురిపై జిల్లా కోర్టులో బ్రాహ్మణ సంఘాలు కేసు పెట్టాయి. కేసును కొత్తపేట పిఎస్‌కు బదలీ చేశారు.

English summary
Krishna district MLAs Malladi Vishnu and Vellampalli Srinivas are lashed out at Collection King Mohan Babu for Denikaina Ready.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X