అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నోస్ట్రడోమస్ చెప్పిందే జర్గుతుంది: పరిపూర్ణానందస్వామి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paripooranananda Swamy
అనంతపురం: హిందువులకు తమ ధర్మంపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి తలపెట్టిన రథయాత్ర గురువారం అనంతపురం జిల్లా కదిరి నుండి ప్రారంభమైంది. ఆయన కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రతి ఆదివారం గంటసేపు దళితులతో ప్రత్యేక పూజలు చేయించాలని పరిపూర్ణానంద ఆలయ కమిటీని కోరారు.

అందుకు ఆలయ కమిటీ సానుకూలంగా స్పందించింది. ఆలయంలోకి ఎవరైనా రావొచ్చునని, అయితే పరిపూర్ణానంద విజ్ఞప్తి మేరకు పూజలు చేయిస్తామని చెప్పారు. అనంతరం పరిపూర్ణానంద తన రథయాత్రను ప్రారంభించారు. స్థానిక వాల్మికీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

హిందూమతం అన్ని మాతాలను ఆదరిస్తుందని, ఏ మతానికి వ్యతిరేకం కాదన్నారు. నోస్ట్రడోమస్ చెప్పినట్లుగా 2014 నాటికి దేశ వైభవం ఉన్నత స్థితికి చేరుకోవడం ఖాయమన్నారు. హిందూ మతం ఇతర మతాలను సోదరభావంతోనే చూస్తుందన్నారు. హిందువుల అవగాహనకే తాను యాత్ర చేస్తున్నట్లు చెప్పారు.

English summary
Sri Peetham chief Paripooranananda Swamy Ratha Yatra was started on Thursday from Anantapur district.http://telugu.oneindia.com/news/2012/11/01/districts-paripoornananda-ratha-yatra-started-107818.html
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X