హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓయు మళ్లీ ఉద్రిక్తం: టిజివిపి విద్యార్థులపై టియర్ గ్యాస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం గురువారం మళ్లీ ఉద్రిక్తంగా మారింది. నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్(టిజివిపి) విద్యార్థులు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 75 మందికి పైగా విద్యార్థులు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు నిరసన తెలిపేందుకు బయలుదేరారు.

వీరిని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు ఖచ్చితంగా వెళ్తామని పట్టుబట్టడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించి విద్యార్థులను చెదరగొట్టారు. విద్యార్థులపై బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తున్న విషయం తెలుసుకున్న నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి ఓయుకు బయలుదేరి వెళ్లారు.

తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెలంగాణవాదులు నల్ల జెండాలతో రాష్ట్రావతరణ దినోత్సవాలకు నిరసన తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి తెలంగాణ భవనంలో నల్ల జెండాను, పార్టీ జెండాను ఎగర వేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణకు న్యాయం జరగాలంటే ప్రత్యేక రాష్ట్రం రావాల్సిందేనన్నారు. టిడిపి, కాంగ్రెసులు ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నాయన్నారు. టిడిపి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తుందా లేదా స్పష్టంగా తెలియజేయాలన్నారు.

English summary
Hyderabad police stopped Telangana Vidyarthi Parishad students at Osmania University gate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X