• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేనికైనా రెడీ: మోహన్ బాబుకు బిజెపి హెచ్చరిక

By Srinivas
|
Denikaina Ready
హైదరాబాద్: హీరో మంచు విష్ణు హీరోగా వచ్చిన దేనికైనా రెడీ చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని భారతీయ జనతా పార్టీ శుక్రవారం డిమాండ్ చేశారు. బిజెపి సీనియర్ నేత లక్ష్మణ్ తదితరులు సమాచార శాఖ చంద్రవదన్‌ను కలిశారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగింప చేయాలని ఆయనకు వారి వినతి పత్రం అందజేశారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇరవై నాలుగు గంటలలోగా తమ డిమాండ్లకు స్పందించకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని వారు హెచ్చరించారు. ఇటీవలి కాలంలో కులమతాలు, వర్గాలు, ప్రాంతాలను అవహేళన చేస్తూ తీసే సినిమాలకు చిత్ర పరిశ్రమ స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.

దేనికైనా రెడీ చిత్రంలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని బ్రాహ్మణులు డిమాండ్ చేస్తుంటే చిత్రం నిర్మాత, దర్శకులు, హీరో వితండవాదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భేషజాలకు పోయి అలాగే ప్రదర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేసిన వారిపై భౌతిక దాడికి దిగడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకుంటే చిత్రాన్ని నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. కాగా గురువారం కృష్ణా జిల్లా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మోహన్ బాబుపై మండిపడ్డ విషయం తెలిసిందే. మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని, అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bharatiya Janata Party warned Denikaina Ready producef to remove controversial scenes from film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more