శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎర్రన్నకు అధికారిక అంత్యక్రియలు: బాబు, ఎన్టీఆర్ హాజరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yerram Naidu last funeral
శ్రీకాకుళం: శుక్రవారం తెల్లవారుజామున రణస్థలి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొలిట బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు అంత్యక్రియలు అధికారికంగా శనివారం ఉదయం ముగిశాయి. నిమ్మాడ వ్యవసాయక్షేత్రంలో అధికారికంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీసులు గౌరవ వందనం చేసి, గాల్లోకి మూడు రౌండ్లు పేల్చారు. నిమ్మాడ మొత్తం విషాదంలో మునిగిపోయింది.

ఎర్రన్నాయుడు అంతిమయాత్రకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు, ామా నాగేశ్వర రావు, నందమూరి హరికృష్ణ, ఉమ్మారెడ్డి, వల్లభనేని వంశీ, నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ, మంత్రులు బాలరాజు, శత్రుచర్ల విజయరామ రాజు, హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, బాబు తనయుడు నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు. భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

ఎర్రన్నాయుడి చితికి ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు నిప్పు అంటించారు. విశాఖపట్నంలో ఓ పెళ్లికి హాజరై శ్రీకాకుళం తిరిగి వస్తున్న ఎర్రన్నాయుడు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

ఎర్రన్నాయుడు మృతికి రాజకీయ ప్రముఖులు అందరూ సంతాపం తెలిపారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్రమంత్రి చిరంజీవి, గవర్నర్ నరసింహన్ తదతరులు తమ సంతాపం తెలిపి, ఆయనను కొనియాడారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యదర్శిని నిన్ననే ఆదేశించారు. ఈ రోజు ఎర్రన్నాయుడు మృతదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.

English summary
Hero Junior Ntr, TDP chief Nara Chandrababu Naidu, Nara Lokesh, Hero Balakrishna were attended in Yerram Naidu's last funeral on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X