వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేనికైనా రెడీ: బ్రాహ్మణులకు మందకృష్ణ మాదిగ అండ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
వరంగల్: దేనికైనా రెడీ, ఎ వుమన్ ఇన్ బ్రాహ్మనిజం వంటి చిత్రాలలో బ్రాహ్మణులను కించపర్చేలా సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయన్న ఆరోపణల విషయంలో బ్రాహ్మణులకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. రాజకీయ పార్టీలతో పాటు పలు కుల సంఘాలు కూడా బ్రాహ్మణ వర్గానికి మద్దతు పలుకుతున్నాయి. తాజాగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు, వికలాంగ హక్కుల పోరాట సమితి(విహెచ్‌పిఎస్) నేత మంద కృష్ణ మాదిగ ఈ సినిమాలపై భగ్గుమన్నారు.

శుక్రవారం మందకృష్ణ వరంగల్ జిల్లాలో మీడియాతో మాట్లాడారు. బ్రాహ్మణజాతిని కించపరిచిన దేనికైనా రెడీ, బ్రాహ్మనిజం సినిమాలను వెంటనే నిలిపి వేసి, ఆ జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. సినిమాలు ఒక వర్గం మనోభావాలను, ఆ వర్గం మహిళల మనస్సులను గాయపరిచేలా అశ్సీలతగా చూపించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తన్నామన్నారు.

ఆ రెండు చిత్రాల్లో బ్రాహ్మణ జాతికి వ్యతిరేకంగా ఉన్న సన్నివేశాల్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణుల ఆందోళనకు తమ మద్దతు ఉందని చెప్పారు. వారి పక్షాన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో శనివారం కలెక్టరేట్ల ముందు నిరసనలు తెలియజేస్తామని మందకృష్ణ మాదిగ చెప్పారు.

English summary

 MRPS president Manda Krishna Madiga gave moral 
 
 support to Brahmins about Denikaina Ready movie 
 
 issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X