వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్రన్న మృతిపై హెచ్చార్సీలో ఫిర్యాదు: 'శిల్ప' నివాళి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yerrannaidu
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు ఆక్సిజన్ అందకనే మృతి చెందారని ధనగోపాల్ అనే వ్యక్తి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. నేషనల్ హైవే అథారిటీ(ఎన్‌హెచ్ఏ) అంబులెన్సులో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వల్లే ఎర్రన్నాయుడు మృతి చెందారని, ఇది కచ్చితంగా నిర్లక్ష్యమేనని ధనగోపాల్ అన్నారు.

దీనికి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కమిషన్ డిసెంబర్ 12 లోగా నివేదిక సమర్పించాలని శ్రీకాకుళం జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది. జిల్లా వైద్యాధికారి, నేషనల్ హైవే అథారిటీ డైరెక్టర్లకు కమిషన్ నోటీసులు జారీ చేసింది.

ఎర్రన్నాయుడు శిల్పం

రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు శిల్పాన్ని పశ్చిమ గోదావరి జిల్లా శిల్పులు చెక్కారు. ఎర్రన్నాయుడు శిల్పాన్ని జీవం ఉట్టిపడేలా మలిచారు. అరుణ ప్రసాద్, కరుణాకర్ అనే శిల్పులు ఎర్రన్నాయుడి శిల్పాన్ని చెక్కారు. దీనిని ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులకు అందజేస్తామని వారు తెలియజేశారు.

English summary
A Right activist knocked at the door of the State Human Rights Commission(HRC) seeking action against those responsible for the tragic death of TDP senior leader Errannaidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X