వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు ఓర్పులేదు, మీడియా అతిగా చూపిస్తోంది: కోట్ల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kotla Surya Prakash Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అద్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మీడియా అతిగా చూపిస్తోందని కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి శనివారం అన్నారు. చిన్న చిన్న పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ కాంగ్రెసు పార్టీ మాత్రం శాశ్వతం అని ఆయన అన్నారు. కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా హైదరాబాద్ వచ్చారు.

వైయస్ జగన్‌కు ఓర్పు లేదన్నారు. ఆయన బలమైన శక్తేమీ కాదని, కేవలం సానుభూతి వల్లనే ఆయన ఉప ఎన్నికల్లో గెలుపొందారన్నారు. ఆ సానుభూతి ఎక్కువ కాలం ఉండదని, 2014లో కాంగ్రెసు పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పని చేసినట్లుగా సానుభూతి ఏమాత్రం పని చేయదన్నారు. రాష్ట్రంలో తిరిగి కాంగ్రెసును అధికారంలోకి తీసుకు వస్తామన్నారు.

ఇందుకోసం రాష్ట్రంలో అందరి నేతలతో కలిసి వెళ్తామన్నారు. రాజకీయాల్లో ఓర్పు లేకుంటే చాలా కష్టమన్నారు. ఆలస్యమైనప్పటికీ తాను ఓర్పుతో ఉండటం వల్లనే తనకు కేంద్రమంత్రి పదవి వచ్చిందన్నారు. జగన్‌కు అవి లేవన్నారు. ముఖ్యమంత్రి పదవి అప్పుడే కావాలని పట్టుబట్టారని, వేచి ఉంటే ఆయనకు కూడా పదవి వచ్చేదన్నారు.

రాష్ట్రానికి కాంగ్రెసు తరఫున పదిహేడేళ్ల తర్వాత రైల్వే మంత్రి పదవి దక్కిందన్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో 39 పనులకు పది పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. కాగా హైదరాబాద్ వచ్చిన కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.

English summary
Central Minister Kotla Surya Prakash Reddy said YSR Congress party chief YS Jaganmohan Reddy have no patience.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X