విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరదలో చిక్కి ఆర్తనాదాలు: లోయలోకి ఒరిగిన రైలింజన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం/విజయవాడ: నీలం ప్రభావం రాష్ట్రంపై బాగానే పడుతోంది. నీలం ప్రభావంతో గత మూడు రోజులుగా రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. విశాఖపట్నం, కృష్ణా, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇళ్లు నీట మునిగాయి. రాకపోకలు స్తంభించాయి. గ్రామాలకు గ్రామాలే జలదిగ్బంధమయ్యాయి.

విశాఖ

విశాఖ

పాయకరావుపేట మండలం రాజవరం వద్ద ఉప్పుటేరులో పలువురు కూలీలు చిక్కుకున్నారు. ఉప్పుటేరు జోరుగా ప్రవహిస్తుండటంతో కూలీలు బయటకు రాలేక చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వారు అక్కడే ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయంలో తలదాచుకున్నారు. యలమంచిలి వద్ద నాలుగు కిలోమీటర్ల మేర జాతీయ రహదారి చెరువును తలపిస్తోంది. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. నర్సీపట్నంలో వరద నీటిలో ఆ ఆర్టీసి వోల్వో చిక్కుకుపోయింది.

కృష్ణా, ఉభయ గోదావరి

కృష్ణా, ఉభయ గోదావరి

భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరిగింది. దీంతో 70 గేట్లను ఎత్తివేసిన అధికారులు లక్షా ఏడువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బుడమేరు, మున్నేరు తదితర వాగులు నీటితో పోటెత్తుతున్నాయి. వెలగటేరు హెడ్ రెగ్యూలేటరీ నుండి నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు చుట్టు పక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. విజయవాడలో బుడమేరు వాగు ఉధృతి మరింత పెరుగుతోంది.

కర్నూలు

కర్నూలు

సుంకేశుల వద్ద తుంగభద్ర నది ఉధృతి క్రమంగా పెరుగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు మత్సకారులు వేటకు వెళ్లి సుంకేశుల వద్ద చిక్కుకున్నారు. అధికారులు ఐదు గంటల పాటు కష్టపడి వారిని రక్షించారు. భారీ వరద నీరుతో తుంగభద్ర పోటెత్తుతోంది.

 విజయనగరం

విజయనగరం

జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాటిపూడి, పెద్దగెడ్డ జలాశయాల వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. విజయనగరం పట్టణంలోని వీటీ అగ్రహారం, సంతోష్ నగర్ కాలనీలోకి నీరు చేరింది. వీరభద్ర పేట జల దిగ్బంధమైంది. పలు రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. ఎస్ కోట మండలం బొడ్డవరం వద్ద దాదాపు మూడువందల కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.

విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ఉబయ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం తదిదర జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు సైతం దెబ్బతిన్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టర్లు సమీక్షలు జరుపుతున్నారు.

నావికాదళం సిబ్బంది బస్సులోని ప్రయాణీకులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. పాయకరావుపేట మండలంలోని సత్వరంలో వరద నీటిలో ఓ వృద్ధురాలు చిక్కుకుపోయారు. ఆనందపురం మండలం తానయ్యవలసలో వాగులో బాలుడు చిక్కుకున్నాడు. చీడిపట్టు వద్ద వంతెన కొట్టుకుపోయింది. నలభై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మునగపాక మండలం మెలిపాక జలదిగ్బంధమైంది.

మూడు రోజుల నుండి గ్రామస్తులు అంధకారంలో మగ్గుతున్నారు. వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. గ్రామస్థులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం దగ్గర హైవేపై రెండు అడుగుల మేర వరద నీరు పొంగుతోంది. ఉప్పుటేరు పొంగిపొర్లుతోంది. పూడిమడక గ్రామం వరదలో మునిగి పోయింది. చోడవరం మండలం భోగాపురం వద్ద శారదా నదిలో ఏడుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. విశాఖ విమానాశ్రయంలోకి భారీగా నీరు చేరింది.

అనంతగిరి మండలంలో రైల్వే ట్రాక్ పైన కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో రెండు రైలింజన్లు లోయలోకి ఒరిగాయి. దాదాపు 250 మీటర్ల మేర కొండచరియలు పడ్డాయి. రైల్వే ట్రాక్ పునరుద్దరణ కోసం రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

కృష్ణా, ఉభయ గోదావరి

భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరిగింది. దీంతో 70 గేట్లను ఎత్తివేసిన అధికారులు లక్షా ఏడువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బుడమేరు, మున్నేరు తదితర వాగులు నీటితో పోటెత్తుతున్నాయి. వెలగటేరు హెడ్ రెగ్యూలేటరీ నుండి నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు చుట్టు పక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. విజయవాడలో బుడమేరు వాగు ఉధృతి మరింత పెరుగుతోంది.

మిల్క్ ప్రాజెక్టు నుండి మైలవరం వెళ్లే రహదారిపై రెండు అడుగులకు పైగా వరద నీరు వెళుతోంది. తుని దగ్గర రైల్వే స్టేషన్ ట్రాక్ మీదుగా నీరు ప్రవహిస్తోంది. దీంతో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్లన్నింటినీ రద్దు చేశారు. కృష్ణా జిల్లాలో పలు చెరువులకు గండి పడింది. ఇంద్రకీలాద్రి పై నుండి కొండచరియలు విరిగి పడ్డాయి. అప్పుడు ఎవరూ రహదారుపై లేక పోవడంతో ప్రమాదం తప్పింది. వాటిని తొలగిస్తున్నారు.

తమ్మిలేరు, తాండవనదులు జోరుగా ప్రవహిస్తున్నాయి. అన్నవరం జాతీయ రహదారి పైకి నీరు చేరింది. అన్నవరం-తుని మధ్య 16వ జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మధ్యలో చిక్కుకు పోయిన పలువురు నీరు, భోజనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుని పట్టణం మొత్తం తాండవనది కారణంగా నీటిమయమైంది. కొన్ని అపార్టుమెంట్లలో మొదటి అంతస్తు వరకు నీరు వచ్చింది.

కాకినాడ, రాజమండ్రి, ముమ్మిడివరం, పాలకొల్లు తదితర ప్రాంతాలు పూర్తిగా జలమలమయ్యాయి. రౌతులపూడులో వరద నీటిలో ఓ వ్యక్తి గల్లంతయ్యారు. తునిలోని ఓ వేదపాఠశాలలో పదిహేను మంది విద్యార్థులు, గురువు వరదలో చిక్కుకుపోతే వారిని రక్షించారు. దాదాపు ఇప్పటి వరకు తూగో జిల్లాలో ముప్పై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కరెంట్ లేక అన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కర్నూలు

సుంకేశుల వద్ద తుంగభద్ర నది ఉధృతి క్రమంగా పెరుగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు మత్సకారులు వేటకు వెళ్లి సుంకేశుల వద్ద చిక్కుకున్నారు. అధికారులు ఐదు గంటల పాటు కష్టపడి వారిని రక్షించారు. భారీ వరద నీరుతో తుంగభద్ర పోటెత్తుతోంది.

విజయనగరం

జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాటిపూడి, పెద్దగెడ్డ జలాశయాల వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. విజయనగరం పట్టణంలోని వీటీ అగ్రహారం, సంతోష్ నగర్ కాలనీలోకి నీరు చేరింది. వీరభద్ర పేట జల దిగ్బంధమైంది. పలు రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. ఎస్ కోట మండలం బొడ్డవరం వద్ద దాదాపు మూడువందల కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.

విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ఉబయ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం తదిదర జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు సైతం దెబ్బతిన్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టర్లు సమీక్షలు జరుపుతున్నారు.

English summary
As Heavy Rains continued to lash Andhra Pradesh due to 'Nilam' cyclonic storm, standing crops in nearly one lakh hectares have been affected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X