హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు: హార్డ్‌కోర్ తెలంగాణ ఎంపీలు, ఎంతదాకా...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కాంగ్రెసులో తెలంగాణ అతివాదులు కొంత మంది ఉన్నారు. రాష్ట్ర మంత్రుల్లో కొద్ది మంది అతివాదులుగా కనిపించినా, వారు ఎప్పటికప్పుడు సర్దుకుపోయే తత్వాన్ని అలవరుచుకున్నారు. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటున్నారు. శానససభ్యుల్లో ఆర్ దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వీర తెలంగాణవాదులు ఉన్నారు. కొంచెం అటూ ఇటుగా కాంగ్రెసు ప్రజాప్రతినిధులంతా తెలంగాణ రాష్ట్ర కావాలని అంటున్నా సమయానికి తగినట్లుగా వ్యవహరిస్తున్నారు.

కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు చాలా మంది మాత్ర వీర తెలంగాణవాదులుగా పేరు పొందారు. తెలంగాణ ఉద్యమాల్లో అగ్ర భాగాన నిలబడుతున్నారు. ఆందోళనల్లో తెలంగాణ జెఎసి నేతలను, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులను తలదన్నే విధంగా కదం తొక్కుతున్నారు. అరెస్టవుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కయ్యానికి కాలు దువుతున్నారు.

కాంగ్రెసు: హార్డ్‌కోర్ తెలంగాణ ఎంపిలు

కె. కేశవరావు రాజ్యసభ సభ్యుడిగా ఉండేవారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన తెలంగాణ పార్లమెంటు సభ్యులకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం ముగిసినా తెలంగాణ పార్లమెంటు సభ్యులకు అదే తరహాలో నాయకత్వాన్ని అందిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలాన్ని పొడిగించడానికి కాంగ్రెసు అధిష్టానం ఇష్టపడలేదు. దీంతో ఆయన మాజీ పార్లమెంటు సభ్యుడిగా మారిపోయారు. ఇప్పుడు దెబ్బ తిన్న పులిలా గర్జిస్తున్నారు.

కాంగ్రెసు: హార్డ్‌కోర్ తెలంగాణ ఎంపిలు

కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మొదటి నుంచి తెలంగాణ వీరాభిమానిగా కనిపిస్తున్నారు. పార్టీలోని సమైక్యవాదులను ఎదుర్కోవడంపై ఆయన అమితాసక్తి ఉన్నట్లు కనిపిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై ఆయన కయ్యానికి కాలు దువ్విన సందర్భాలున్నాయి. ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అది కేవలం తెలంగాణ కోసమే అనే విధంగా ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారు.

కాంగ్రెసు: హార్డ్‌కోర్ తెలంగాణ ఎంపిలు

జి. వివేక్ పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ఆయన వృద్ధ కాంగ్రెసు నాయకుడు జి. వెంకటస్వామి కుమారుడు. తెలంగాణ కోసం ఆయన చక్రం తిప్పుతున్నట్లు కనిపిస్తారు. వెంకటస్వామి 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్లుగా తెలంగాణ కోసం గళం విప్పుతున్నారు.

కాంగ్రెసు: హార్డ్‌కోర్ తెలంగాణ ఎంపిలు

మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం సౌమ్యుడిగా కనిపిస్తారు. కానీ, తెలంగాణ విషయంలో ఆయన కచ్చితంగా మాట్లాడుతారు. తెలంగాణ కోసం దేనికైనా రెడీ అన్నట్లు మాట్లాడుతారు.

కాంగ్రెసు: హార్డ్‌కోర్ తెలంగాణ ఎంపిలు

నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ మొదటి నుంచి కరుడు గట్టిన తెలంగాణవాదిగా ముద్ర వేయించుకున్నారు. తెలంగాణ కోసం సీమాంధ్ర నాయకులపై వాగ్బాణాలు విసరడంలో ఆయనది అందె వేసిన చేయి. గత ఎన్నికల్లో తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో చాలా చోట్ల కాంగ్రెసు అపజయం పాలైనా తెలంగాణవాదం వల్లనే పార్లమెంటు సభ్యుడిగా గెలిచారని అంటారు.

ఇకపోతే, నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తెలంగాణవైపు గట్టిగానే నిలపడుతున్నారు. అతివాదులుగా ముద్ర పడిన మిగతా ఎంపిల అడుగుల్లో అడుగు వేస్తూ నడుస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రహస్య ఎజెండా వేరే ఉందని పాల్వాయి గోవర్దన్ రెడ్డి సీనియర్ కాంగ్రెసు నాయకులు ఆరోపిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసులో ఆయన చేరిపోతారని ఆయన రాజగోపాల్ రెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టినా సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ తెలంగాణ కావాలంటూనే, సోనియా గాంధీ తెలంగాణ ఇస్తారని, అంత వరకు ఆందోళనలు అవసరం లేదని అంటుంటారు.

English summary
Few Congress MPs are behaving as hardcore Telanganites. Though K Keshav Rao became former MPs he is leading Congress Telangana MPs. Ponnam Prabhakar, Madhu Yashki and other says no alternative for separate Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X