హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుఫానువల్ల 25 మంది మృతి, నేడూ వర్షం: రఘువీరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
హైదరాబాద్: నీలం సైక్లోన్ కారణంగా రాష్ట్రంలో కురిసిన తుఫానుల వల్ల 25 మంది మృతి చెందారని మంత్రి రఘువీరా రెడ్డి సోమవారం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. తుఫాను ప్రభావంతో 1200 ఇళ్లు ధ్వంసం కాగా, 2.25 లక్షళ హెక్టార్ల పంట నీట మునిగిందన్నారు. ఇవాళ కూడా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పారు.

అంతకుముందు రఘువీరా రెడ్డి నీలం తుఫాను ప్రభావంపై విపత్తు నిర్వహణ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్షించారు. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ చర్యలను చేపట్టాలని ఆదేశించారు. నష్టం అంచనాపై ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాల్సిందిగా సూచించారు.

ముఖ్యమంత్రి సమీక్ష

తుఫానుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి పదిమంది మంత్రులు హాజరయ్యారు. బొత్స సత్యనారాయణ, రఘువీరా రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, సుదర్శన్ రెడ్డి, టిజి వెంకటేష్, డొక్కా మాణిక్య వర ప్రసాద్, శ్రీధర్ బాబు, శత్రుచర్ల విజయ రామరాజు, ఏరాసు ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు.

కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు తుఫాను బాధిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఏరియల్ సర్వే చేసే అవకాశముంది. కాగా వరంగల్ జిల్లాలో వర్షాల కారణంగా పంట బాగా నీట మునిగింది. తెలుగుదేశం పార్టీ నేతలు, తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

English summary
At least 22 people have died in rain-related incidents in Andhra Pradesh as heavy rains continued to batter several regions under the aftermath of Cyclone Nilam, which lashed coastal regions in eastern India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X