10 జన్‌పథ్ వద్ద టి-నేతల హంగామా: ఎదురుచూపు

సోనియా దర్శనం కోసం మన నేతలు అక్కడ పడిగాపులు కాస్తున్నారు. సోనియా ఇంటి వద్ద జాతరను తలపిస్తోంది. సోనియా నివాసానికి వెళ్లే రహదారులు అన్నీ కాంగ్రెసు నాయకులతో కిక్కిరిసిపోయాయి. దాదాపు ఇరవై మందికి పైగా తెలంగాణ ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు. సోనియా గాంధీ అపాయింటుమెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
తమకు కావాల్సింది ముఖ్యమంత్రి మార్పు కాదని... తెలంగాణ రాష్ట్రం అని వారు చెబుతున్నారు. అదే విషయాన్ని తాము సోనియా గాంధీ దృష్టికి తీసుకు వెళ్తామని చెబుతున్నారు. భారీగా నేతలు తరలి రావడంతో సోనియా గాంధీ ఇంటి వద్ద కొద్దిగా తోపులాట కూడా జరిగింది.
ఇరవై మంది ఎమ్మెల్యేలు సహా పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా సోనియా గాంధీ అపాయింటుమెంటు కోసం వేచి చూస్తున్నారు. కేంద్రమంత్రి బలరామ్ నాయక్, రాష్ట్ర మంత్రి గీతా రెడ్డి సహా పలువురు ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి మార్పు నేపథ్యంలో సోనియా గాంధీతో మర్రి శశిధర్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాంగ్రెసు ఎంపీలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తాము ముఖ్యమంత్రి మార్పుపై సోనియా గాంధీతో చర్చించలేదని చెప్పారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. అంతకుముందు ఎంపీలు గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications