విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎదురుపడిన బాబు, విజయమ్మ: జగన్ పార్టీ వాగ్వాదం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-YS Vijayamma
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సోమవారం ఒకరికొకరు ఎదురుపడ్డారు. నీలం తుఫాను కారణంగా తీర ప్రాంత జిల్లాలు జలదిగ్బంధమయ్యాయి. బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు, విజయమ్మలు కృష్ణా జిల్లాకు వెళ్లారు. అయితే వారిద్దరి కాన్వాయ్ ఓ చోట ఎదురుపడ్డాయి.

దీంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బాపుపాడ మండలం కనుమోములలో ఒకే మార్గంలో బాబు, విజయమ్మల కాన్వాయ్‌లు ఎదురుపడ్డాయి. ఇరు పార్టీల నేతలు నినాదాలతో హోరెత్తించారు. బాబు కోసం విజయమ్మ కాన్వాయ్‌ని పోలీసులు కాసేపు నిలిపివేశారు. దీంతో జగన్ పార్టీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. కాగా తుఫాను బాధిత ప్రాంతాలను పరిశీలించిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మాదిరిగా ఏ ప్రభుత్వం ఆదుకోలేదన్నారు.

రైతులు అకాల వర్షాలతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏమాత్రం స్పందించడం లేదన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ పేరుతో కాంగ్రెసు నాయకులు జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ పైనే తొలి సంతకం చేస్తానన్నారు. రుణ మాఫీ ఎలా అమలు చేస్తారని కిరణ్ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలా అమలు చేయాలో తనకు బాగా తెలుసునన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామన్నారు.

ముంపు బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా వైయస్ విజయమ్మ కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడుకు చేరుకున్నారు. అక్కడ బాధితులను పరామర్శించి, చెరువులను తలపిస్తున్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. పుట్టగుంట దగ్గర బుడమేరు బ్రిడ్జిని విజయమ్మ పరిశీలించారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం తుఫాను ప్రాంత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఆమె వైయస్సార్ కాలనీలో వైయస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

English summary
YSR Congress party activists questioned police for stopping party honorary president YS Vijayamma's convoy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X