వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 74.62% పోలింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Himachal Pradesh on a high: 75% turnout
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఆదివారం ఉదయం మందకోడిగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ క్రమంగా పుంజుకుంది. ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 68 స్థానాలకు గాను పోలింగ్ ఆదివారం ఒకే దశలో నిర్వహించిన విషయం తెల్సిదే. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 74.62 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం డైరక్టర్ జనరల్ అక్షయ్ రౌట్ వెల్లడించారు.

ఇప్పటివరకు 2003 ఎన్నికల్లో నమోదైన 74.51 శాతం పోలింగే రికార్డుగా ఉందని, గత ఎన్నికల్లో 71.61 ఓటింగ్ జరిగిందని ఆయన వివరించారు. ఉదయం పూట మందకొడిగా సాగిన ఉష్ణోగ్రతలు ఆ తర్వాత.. క్రమంగా పుంజుకుని సాయంత్రానికి రికార్డు స్థాయికి చేరుకున్నట్టు ఆయన వివరించారు. చాంబా జిల్లాలోని చురాహ్ నియోజకవర్గంలో అత్యధికంగా 78 శాతం పోలింగ్ నమోదైనట్టు ఆయన తెలిపారు.

షిమ్లా నియోజకవర్గంలో అత్యల్పంగా 49 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కిన్నౌర్‌లోని కా పోలింగ్ కేంద్రంలో 100 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న 18 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు చెప్పారు. అధికారిక గణాంకాల్లో పోలింగ్ శాతం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు చెప్పారు. సాయంత్రం ఐదు గంటల వరకూ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

హిమాచల్ ప్రదేశ్‌లో 46.08 లక్షల ఓటర్లు ఉన్నారు. 7,253 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెసు, బిజెపి మధ్యే ముఖాముఖి పోరు జరుగుతోంది. బిఎస్పీ 66 మంది అభ్యర్థులను, శివసేన నాలుగురు అభ్యర్థులను బరిలోకి దింపింది. దేశంలోనే తొలి ఓటరైన శ్యాంశరణ్ నేగీ ఆదివారం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎలక్షన్ అధికారులు చెప్పారు.

English summary
Himachal Pradesh on Sunday registered a record high polling of around 75% in elections for 68 assembly constituencies. In 2007, the state had registered 71% turnout.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X