వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నెండేళ్లు పూర్తయిన ఐరన్ లేడీ షర్మిల నిరాహార దీక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

Irom Chanu Sharmila
ఇంపాల్: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మిల నిరశనకు నేటితో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. మణిపూర్ ప్రజల స్వేచ్ఛ కోసం షర్మిల పుష్కరకాలంగా అన్నపానీయాలు ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇన్నేళ్లుగా ఆమె కనీసం మంచి నీరు కూడా ముట్టలేదు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్‌పిఏ)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె 2000 నవంబర్ ఐదో తేది నుండి నిరాహార దీక్ష చేపట్టారు.

2000 నవంబర్ 2న ఇంపాల్‌ లోయలోని మలోంలో అసోం రైఫిల్స్ ఎన్‌కౌంటర్‌లో పదిమంది పౌరులు చనిపోయారు. షర్మిల పౌరహక్కుల కార్యకర్త. దీనిపై ఆమె గళమెత్తారు. వెంటనే ఐదో తేది నుండి నిరాహార దీక్ష చేపట్టారు. మాన వహక్కుల ఉద్యమకారులు కిరాతకమైన చట్టంగా అభివర్ణించే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేస్తూ ఇప్పటికీ తన దీక్షపై వెనక్కి తగ్గలేదు.

అయితే ఆమెకు అప్పటి నుండి ముక్కు ద్వారా బలవంతంగా ఫ్లూయిడ్స్ అందిస్తున్నారు. అప్పటి నుండి మొక్కవోని దీక్షతో షర్మిల నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ఈ చట్టంపై ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు. ఆత్మహత్య నేరం కింద ఆమె జైలుకు, కోర్టుకు, ఇంటికి అంటూ ఇలా పన్నెండేళ్లుగా తిరుగుతున్నారు. ఫ్లూయిడ్స్ బలవంతంగా ఎక్కిస్తున్నారు. ప్రస్తుతం షర్మిల జ్యూడిషియల్ కస్టడిలో ఉన్నారు.

షర్మిలకు మద్దతుగా పౌరహక్కుల కార్యకర్తలు, స్వచ్చంధ సంస్థలు సోమవారం సాయంత్రం మణిపూర్‌లో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తారు. ఆమె ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల సార్లు కోర్టులు, జైళ్లు, హాస్పిటల్ చుట్టు తిరిగి ఉంటారు. 39 ఏళ్లున్న షర్మిల బరువు ఇప్పుడు కేవలం 37 మాత్రమే. రోజు రోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. పాలకులు స్పందించక పోవడంపై పౌరసంఘాలు మండిపడుతున్నాయి.

English summary
The 'Iron Lady of Manipur' Irom Chanu Sharmila, who has been on a hunger strike since 2000 demanding repeal of Armed Forces Special Power Act (AFSPA), is completing 12 years of fast today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X