వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణే ముఖ్యమంత్రి, తెలంగాణపైనే అడిగారు: వాయలార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vayalar Ravi
న్యూఢిల్లీ: 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డియే ముఖ్యమంత్రిగా ఉంటారని కేంద్రమంత్రి వాయలార్ రవి మంగళవారం మీడియాతో అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మారుస్తారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. కిరణ్‌ను మార్చాల్సిన అవసరం ఏమాత్రం లేదని, మార్పు చర్చ కాంగ్రెసు పార్టీ అధిష్టానం మధ్య ఇంతవరకు జరగలేదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.

తెలంగాణపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారని అన్నారు. అందరి అభిప్రాయాలను తాను తీసుకొని తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి చేరవేస్తున్నానని చెప్పారు. తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధ్యక్షురాలే అని చెప్పారు. తమను తెలంగాణ ప్రాంత నేతలు పలువురు కలిశారని, ఎవరూ ముఖ్యమంత్రి మార్పు పైన చర్చించలేదని, కేవలం తెలంగాణను పరిష్కరించాలని మాత్రమే కోరారని తెలిపారు.

కాగా ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డిని మార్చి ఆయన స్థానంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు.. మర్రి శశిధర్ రెడ్డి, కుందూరు జానా రెడ్డి లేదా డి.శ్రీనివాస్‌ను కూర్చుండబెడతారనే వార్తలు వచ్చాయి. నవంబర్ 9వ తేది లోగా కిరణ్ మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాయలార్ రవి మంగళవారం స్పందిస్తూ.. మార్పు కేవలం ఊహాగానాలే అని కొట్టి పారేశారు.

రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెసు ప్రజా సభకు వెళ్లిన రాష్ట్ర నేతలు పలువురు ఆ సభ ముగిసిన తర్వాత కూడా అక్కడే మకాం వేశారు. సోమవారం సోనియా గాంధీ సహా పలువురు పార్టీ పెద్దలను కలిసి తెలంగాణపై తేల్చాలని, ముఖ్యమంత్రి మార్పు అవసరం లేదని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

English summary
Central Minister Vayalar Ravi said that Kiran Kumar Reddy is AP CM till 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X