విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2 గంటలుగా ఎయిర్‌పోర్టులో కిరణ్ నిరీక్షణ: మంత్రులూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్/విజయవాడ: ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పని పరిస్థితుల్లో మంగళవారం హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం(శంషాబాద్ ఎయిర్ పోర్టు)లో రెండు గంటలుగా నిరీక్షిస్తున్నారు. నీలమ్ తుఫాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి.

పంటలు నీట మునిగాయి. పలువురు మృతి చెందారు. లక్షలాది మంది మంచి నీరు, ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి తుఫాను బాధిత ప్రాంతాల్లో ఎరియల్ సర్వే కోసం మంగళవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అయితే కృష్ణా జిల్లాలోని విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో వాతారవణం అనుకూలించక పోవడంతో హెలికాప్టర్ టేకాఫ్ కావడం లేదు.

ఎరియల్ సర్వే కోసం ఉదయమే బయలుదేరిన కిరణ్ వాతావరణం అనుకూలించక పోవడంతో విమానాశ్రయంలోనే నిరీక్షిస్తున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, నేతలు కూడా ఉన్నారు. గన్నవరం విమానాశ్రయంలో కూడా ఆయన కోసం పలువురు నేతలు, మంత్రులు ఉన్నారు. వాతారవరణం అనుకూలంగా లేక పోవడంతో కిరణ్ ఎరియల్ సర్వే దాదాపు రెండు గంటల నుండి మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. వాతావరణం అసలే అనుకూలించని పక్షంలో ఈ రోజు కూడా ఎరియల్ సర్వే రద్దయ్యే అవకాశాలు లేకపోలేదు.

గన్నవరం ఎయిర్ పోర్టు నుండి క్లియరెన్స్ రాలేదు

ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే కోసం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారని అయితే, గన్నవరం విమానాశ్రయం నుండి క్లియరెన్స్ రాలేదని మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. క్లియరెన్స్ ఇచ్చాక బయలుదేరుతారని చెప్పారు. ఖమ్మం, ఉభయగోదావరి తదితర జిల్లాల్లో కిరణ్ ఎరియల్ సర్వే చేస్తారని చెప్పారు.

తుఫాను బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామన్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, మృతుల కుటుంబాలకు, పంట నష్టపోయిన వారికి పరిహారం ఇస్తామన్నారు. కాగా హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి తునిలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

English summary
CM Kiran Kumar Reddy is waiting in Shamshabad airport since 7'O clock along with ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X