వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివేకానంద, దావూద్‌ ఐక్యూల పోలిక: చిక్కుల్లో గడ్కరీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Swamy Vivekananda-Dawood Ibrahim
భోపాల్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గడ్కరీ... స్వామి వివేకానంద స్వామి ఐక్యూతో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పోల్చి విమర్శలు ఎదుర్కొంటున్నారు. భోపాల్‌లో ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మనస్తత్వ శాస్త్రంలో వ్యక్తుల మనస్థత్వ స్థాయిని కొలుస్తారని, తమ మేధస్సును ఏ రంగంలో ఉపయోగిస్తారన్న దానిని బట్టి వ్యక్తికి వ్యక్తికి మధ్య తేడా ఉంటుందని, మనస్తత్వ శాస్త్రం ప్రకారం స్వామి వివేకానంద, దావూద్ ఇబ్రహీం మేధో స్థాయిని లెక్కిస్తే.. అది దాదాపు సమానంగా ఉండవచ్చునని కానీ, వివేకానంద స్వామి దానిని జాతి నిర్మాణానికి, సౌభ్రాత్రానికి, ఆధ్యాత్మికతకు వినియోగిస్తే, నేర సామ్రాజ్యంలో అగ్రస్థాయికి చేరేందుకు దావూద్ ఇబ్రహీం ఉపయోగించాడన్నారు.

అయితే, గడ్కరీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ.. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఆయన అభిమానులు ఏమైనా స్పందిస్తారా అని ట్విటర్‌లో ట్వీట్ చేశారు. సంఘ్ పరివార్ కూడా ఇలాగే మాట్లాడుతుందని, గడ్కరీ అక్కడి నుంచే వచ్చిందని, అందుకే ఆయన అలాగే మాట్లాడుతున్నారని విమర్శించారు. గడ్కరీ వ్యాపారవేత్త అన్నది నిజమని, ఆయన బోగస్ కంపెనీలను ఏర్పాటు చేశారన్నది నిజమన్నారు.

సంఘ్‌పరివార్ ఉగ్రవాద దాడులకు పాల్పడిందన్నది, అన్నా హజారే ఆందోళనకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇచ్చిందన్నది, బాబా రామ్‌దేవ్ భయంకర నేరగాడు అన్నది, ఠాక్రే కుటుంబం బీహార్ నుంచి వచ్చిందన్నది, కేజ్రీవాల్‌కు రాజకీయ లక్ష్యాలు ఉన్నాయన్నది నిజమని, ట్విటర్‌లో నన్ను విమర్శించేవాళ్లు పునరాలోచించుకోవాలని సూచించారు.

వివేకానంద, దావూద్ మేధో స్థాయిని ఎలా పోల్చుతారని కాంగ్రెస్ నేత జగదంబికా పాల్ మండిపడ్డారు. ఎవరైనా గడ్కరీ ఐక్యూను, కసబ్ ఐక్యూతో పోలిస్తే బిజెపి ఏం జవాబు చెబుతుందని ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో గడ్కరీ వెంటనే స్పందించారు. తాను వివేకానందను దావూద్‌తో పోల్చిలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తన తెలివి తేటలను సరైన దిశలో ఉపయోగించుకుంటే స్వామి వివేకానంద అవుతారని, అడ్డదారులు తొక్కితే దావూద్ ఇబ్రహిం అవుతారని చెప్పానని వివరించారు.

English summary
BJP chief Nitin Gadkari, already battling allegations regarding the source of funding of his companies, on Monday derew flad for drawing a comparison between the IQ levels of Swamy Vivekananda and Don Dawood Ibrahim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X