వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ అమెరికా ప్రెసిడెంట్‌గా ఒబామా: కలిసొచ్చిన శాండీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండోసారి అధ్యక్షుడిగా విజయం సాధించారు. తొలుత వెనుకపడిపోయిన ఒబామా క్రమంగా పుంజుకున్నారు. స్వల్ప ఆధిక్యం నుండి ఆఖరున ఒక్కసారిగా దూసుకు పోయారు. ప్రత్యర్థి మిట్ రోమ్నీ పలు రాష్ట్రాల్లో ఒబామాకు గట్టి పోటీనే ఇచ్చారు. పోటా పోటీగా జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్లనే విజయం వరించింది. నాలుగేళ్ల పాలనతో పాటు ఇటీవల వచ్చిన శాండీ తుఫాను ఒబామాకు కలిసి వచ్చిందనే చెప్పవచ్చు.

Barak Obama

శాండీ తుఫాను వచ్చినప్పుడు ఒబామా బాగా చర్యలు చేపట్టారని అమెరికన్‌లు అభిప్రాయపడ్డారు. దీంతో ఇది ఆయనకు కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. శాండీ తుఫాను సహాయక చర్యల్లో ఫెయిల్ అయితే ఫలితం మరోలా ఉండేదంటున్నారు. కానీ శాండీ తుఫాను సహాయంలో ఒబామా సక్సెస్ అయ్యారని దాదాపు అరవై ఆరు శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. దీంతో అతని వైపే మరోసారి మొగ్గు చూపారు.

మ్యాజిక్ ఫిగర్ 270 కాగా ఒబామా ఇప్పటికే 303 ఓట్లు సాధించారు. రోమ్నీ 206 సాధించాడు. ఎలక్టోరల్ ఓటింగులో స్పష్టమైన ఓటంగ్ లభించింది. మొదట్లో పుంజుకున్న రోమ్నీ ఆ తర్వాత వెనుకబడ్డారు. కాగా 538 ఓట్లలో బరాక్ ఒబామా 275 ఓట్లు సాధించారు. కాగా ఒబామాకు ప్రధాని మన్మోహన్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుభాకాంక్షలు తెలియజేశారు.

English summary
President Obama will win re-election, Fox News projects. The call comes after the president was the projected winner in the crucial battleground of Ohio, and subsequently won both Iowa and Oregon. This put Obama over the required 270 electoral votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X