వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటమిని అంగీకరించిన మిట్ రోమ్నీ: ఒబామాకు ఫోన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mitt Romney-Barack Obama
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓటమి చవిచూసిన మిట్ రోమ్నీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. ఒబామా గెలిచిన తర్వాత రోమ్నీ స్వయంగా అతనికి ఫోన్ చేసి అభినందించారు. అనంతరం ఆయన అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాను ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెప్పారు. అమెరికా దేశం ప్రస్తుతం క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటుందన్నారు.

ఆ సమస్యలను ఒబామా అధిగమిస్తాడని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లు చెప్పారు. అమెరికా సమస్యల్ని తొలగించడంలో ఒబామా సక్సెస్ అవుతారని తాను గట్టిగా నమ్ముతున్నానన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో తనకు సహకరించిన వారిందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. తాను ఒబామాకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

12వసారి రెండో అధ్యక్షుడిగా ఒబామా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నల్ల సూరీడు బరాక్ ఒబామా రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న వారిలో పన్నెండో వ్యక్తి. అమెరికా అధ్యక్షుడిగా అత్యధిక కాలం రూజ్ వెల్ట్ పని చేశారు. అమెరికా 44వ అధ్యక్షుడిగా ఒబామా గెలిచారు.

అయితే ప్రస్తుత నియమావళి ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండుసార్ల కంటే ఎక్కువసార్లు పోటీ చేసేందుకు అవకాశం లేదు. ఒబామా పోటీ చేసి గెలుపొందటం ఇది రెండోసారి. కాగా ఎన్నికల్లో ఒబామా గెలుపొందడంతో అమెరికాలో డెమోక్రాట్లు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

English summary
Mitt Romney phoned to America President Barack Obama for his winning in elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X