హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన జగన్ పార్టీ నేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Maddala Rajesh
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి శాసనసభ్యుడు మద్దాల రాజేష్ గురువారం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజేష్ గురువారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ కార్యాలయానికి చేరుకొని తన రాజీనామాను సమర్పించారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అతను తన లేఖను కార్యాలయంలో అందజేశారు. మద్దాల రాజేష్ ఇటీవల కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో అతను తన పదవికి రాజీనామా చేశారు.

రాజేష్ పది రోజుల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిసిన విషయం తెలిసిందే. త్వరలో తన శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తాను కార్యకర్తగా పని చేస్తానని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే తాను శాసనసభ్యుడిగా విజయం సాధించానని ఆయన విజయమ్మతో భేటీ తర్వాత మీడియాతో చెప్పారు.

వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే తన నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పుకున్నారు. కాగా గత ఎన్నికల్లో రాజేష్‌పై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కర్రా రాజారావు కూడా త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారని సమాచారం. కొవ్వూరులో జరిగే బహిరంగ సభలో వైయస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు.

English summary
West Godavari district Chintalapudi MLA Maddala Rajesh has resigned to Legislative on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X