వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాక్టర్ అకౌంట్ హ్యాక్: రోమ్నీ ఖాతాలోకి 3.52 లక్షలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mitt Romney
పాట్నా: బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ డాక్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురై అందులోని రూ.3.52 లక్షలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడి ఓడిపోయిన మిట్ రోమ్నీ ప్రచార ఖాతాలోకి వెళ్లాయి. సుశీల్ కుమార్ వర్మ అనే డాక్టర్ పాట్నాలో ఉంటున్నాడు. అతనికి యాక్సిస్ బ్యాంకులో ఖాతా ఉంది.

యాక్సిస్ బ్యాంకులోని ఆయన ఖాతా అక్టోబర్ పదవ తేదిన హ్యాకింగ్‌కు గురైంది. హ్యాకర్లు ఆయన ఖాతా నుండి రూ.3.52 లక్షలను అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో గల రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మిట్ రోమ్నీ ప్రచార నిధి ఖాతాకు మళ్లించారు. ఈ విషయాన్ని పాట్నాలోని శ్రీకృష్ణపురి పోలీసు స్టేషన్ అధికారి సంజయ్ పాండే బుధవారం తెలియజేశారు.

తన ఖాతా నుండి డబ్బులు డెబిట్ అయినట్లుగా తనకు ఓ సంక్షిప్త సందేశం(ఎస్సెమ్మెస్) వచ్చిదని డాక్టర్ వర్మ చెబుతున్నాడు. తనకు సందేశం వచ్చిన వెంటనే తాను పోలీసులను ఆశ్రయించానని, దీంతో తన అకౌంట్ హ్యాక్ అయి, రోమ్నీ ఖాతాలోకి డబ్బులు వెళ్లినట్లుగా వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు.

పూరి ఉత్తర శ్రీకృష్ణపురిలో ఉంటాడు. వర్మకు మెసేజ్ రావడంతో తమను ఆశ్రయించాడని కేసు విచారణ జరుపుతున్న పాండే తెలిపాడు. బీహార్ డిజిపి అభయానంద్ మాట్లాడుతూ... సైబర్ క్రైమ్ పోలీసు కేసును నమోదు చేసుకుందని, కేసులో పురోగతి సాధిస్తున్నామని చెప్పారు. డాక్టర్ తన అకౌంట్‌ను బ్లాక్ చేశారు.

English summary

 A doctor's account in a private bank here was hacked and Rs 3.52 lakh transferred to the account of defeated US presidential candidate Mitt Romney's campaign fund bank account, a police official said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X