వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేనికైనా రెడీపై బిజెపి ఫైర్: బాలీవుడ్‌కు తాకనున్న సెగ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Denikaina Ready
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేనికైనా రెడీ చిత్రంలో బ్రాహ్మణులను అవమానించే విధంగా ఉన్న నేపథ్యంలో మోహన్ బాబుకు ఇచ్చిన పద్మశ్రీ బిరుదును వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేత సుధీష్ రాంభొట్ల తదితరులు బుధవారం డిమండ్ చేశారు. సినిమాలో బ్రాహ్మణ మహిళలను అసభ్యంగా చూపించారని, పవిత్ర చండీయాగాన్ని డబ్బుల కోసమే చేస్తున్నట్టుగా నిందలు వేశారని వారు మండిపడ్డారు.

బ్రాహ్మణ సమాజాన్ని అవమానపరుస్తున్న మోహన్ బాబు నుంచి పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలన్నారు. మోహన్‌బాబు నిర్వాకాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖండించాల్సిందిపోయి ఆయన్ను వెనకేసుకురావడం గర్హనీయమన్నారు. ఎన్నడూ లేనివిధంగా బ్రాహ్మణ సమాజం వీధుల్లోకి ఎందుకు వస్తుందో సామాజిక స్పృహ కలిగిన రామానాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి గోపాలకృష్ణ ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు.

వాళ్లేమైనా సుద్దులు చెప్పదల్చుకుంటే మోహన్‌ బాబుకు చెప్పాలని సూచించారు. ఈ చిత్రం తీసినవారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని న్యాయస్థానం తీర్పు చెప్పినప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదని ధ్వజమెత్తారు. విష్ణు, మోహన్‌బాబులను అరెస్ట్ చేసి, జైలుకు పంపించాలని డిమాండ్‌ చేశారు. వారు బ్రాహ్మణులు చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు.

బాలీవుడ్‌కు తాకనున్న సెగ

హిందూ మత విశ్వాసాలను కించపరిచేలా బాలీవుడ్‌లో తీస్తున్న సినిమాల తీరుపై ఎండగట్టడానికి ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. ఈ అంశాన్ని శీతాకాల పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటులో లేవనెత్తుతామని లోక్‌సభలో విపక్ష నేత సుష్మా స్వరాజ్ బుధవారం తెలియజేశారు. ఇందుకు ఇతర పార్టీల సభ్యుల మద్దతు తీసుకుంటామన్నారు.

ఇటీవల విడుదలైన ఓ మైగాడ్, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాల్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలున్నాయని ఆమె ధ్వజమెత్తారు. బుధవారం ఢిల్లీలో గోవుల సంరక్షణపై ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో సుష్మా మాట్లాడారు. వేలాది పేర్లుండగా.. కేవలం హిందూ దేవతామూర్తుల పేర్లతో కించపరిచే సన్నివేశాలను ఎందుకు చిత్రీకరిస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి సన్నివేశాల్ని నిలిపేయాలని పార్లమెంటులో డిమాండ్ చేస్తామన్నారు.

English summary

 Bharatiya Janata Party is ready to fight against films, which are blam Hindu gods.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X