వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బరాక్ ఒబామా గెలుపు: 'అమెరికా' పదనిసలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరాక్ ఒబామా రెండోసారి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి మిట్ రోమ్నీ మొదట మంచి పోటీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత బాగా వెనుకబడ్డారు. ఒబామా 303, రోమ్నీ 206 స్థానాల్లో గెలుపొందారు. ఒబామా గెలుపొందటంతో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. గెలిచిన అనంతరం ఒబామా ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. అమెరికా ప్రజలకు భవిష్యత్తుపై హామీ ఇచ్చారు.

ఒబామా గెలుపు: పదనిసలు

గెలుపొందిన తర్వాత ఒబామా తన విజయానందాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. 'మరో నాలుగేళ్లు' అంటూ ఒబామా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అందులో తన భార్యను హత్తుకున్న ఫోటోను ఉంచారు. ఇదే ఫోటోను ఫేస్‌బుక్‌లోనూ పెట్టారు. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిందిగా పేరుపొందింది. మేం మీకు ఓటు వేశం, విద్య, వైద్యం, గ్రీన్ ఎనర్జీ విషయంలో మీరు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చుకుని మేం గర్వపడేలా చేయండని అభిమానులు షేర్ చేశారు.

ఒబామా గెలుపు: పదనిసలు

గెలుపొందిన తర్వాత ఒబామా తన కూతుళ్లు సారా, మలియాతో ఒక కుక్క చాలు అంటూ జోక్ చేశారు. ఒబామా 2008లో తొలిసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందినప్పుడు కూతుళ్లు ఓ కుక్కను అడిగారు. ఇప్పుడు రెండోసారి మళ్లీ కుక్కను అడుగుతారేమోననే ఉద్దేశ్యంతో అతను ఒక కుక్క చాలు అని చమత్కరించారు.

 ఒబామా గెలుపు: పదనిసలు

బరాక్ ఒబామా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలవడంతో డెమోక్రటిక్ పార్టీ భవనం నీలి కాంతులతో విరజిల్లింది. న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఒబామా గెలుపుకు సూచకంగా నీలం రంగు కాంతులతో తణుకులీనింది. ఇది ఆ పార్టీ గుర్తు. అంతకుముందు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఓ వైపు నీలం రంగు, మరో వైపు రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎరుపు రంగు గుర్తులు పెరుగుతూ.. తగ్గుతూ(పార్టీలు గెలిచిన గెలిచిన ఓట్లను అనుసరించి) వచ్చాయి. ఒబామా గెలిచిన విషయం తెలియగానే 102 అంతస్తుల భవనం మొత్తం నీలం రంగులోకి మారిపోయింది.

ఒబామా గెలుపు: పదనిసలు

బిల్ క్లింటన్(జనవరి 20, 1993 - జనవరి 20, 2001), జార్జి బుష్(జనవరి 20, 2001 - జనవరి 20, 2009)ల తర్వాత ఒబామా రెండుసార్లు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. వరుసగా రెండోసారి గెలిచిన వారు 14 మంది ఉన్నారు. అయితే వరుసగా రెండుసార్లు గెలిచిన ముగ్గురు వ్యక్తుల్లో క్లింటన్, బుష్, ఒబామా ఉన్నారు.

ఒబామా గెలుపు: పదనిసలు

ఒబామా ఎన్నికల కోసం విరాళాల సేకరణ సమయంలో ప్రసంగించినప్పుడు పలుమార్లు మన జాతిపిత మహాత్మా గాంధీ, దక్షిణాఫ్రికా నేత నెల్సన్ మండేలాల పేర్లను పలుమార్లు ప్రస్తావించారు. రెండోసారి తనకు అవకాశమివ్వాలని కోరుతూ... ఆ మహాత్ములు సాధించినట్లే.. నిజమైన మార్పును సాధఇంచడానికి సాయం చేయాలని కోరారు.

ఒబామా గెలుపు: పదనిసలు

అమెరికాలో ఒబామా గెలిస్తే కెన్యా దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఒబామా తండ్రి గ్రామమైన కెన్యాలోని కొగెలోలో ఫలితాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా తెర కూడా ఏర్పాటు చేశారు. రాత్రంతా ఆ గ్రామ ప్రజలు ఫలితాల కోసం ఎదురు చూశారు. గెలుపు విషయం తెలియగానే గ్రామ ప్రజలకు పాటలు పాడుతూ చిందేశారు.

ఒబామా గెలుపు: పదనిసలు

అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మిట్ రోమ్నీకి తన సొంత రాష్ట్రాల్లోనూ ఎదురు దెబ్బ తగిలింది. రోమ్నీ తన పుట్టిన స్థలం మిచిగాన్‌తో పాటు గవర్నర్‌గా పని చేసిన మసాచూసెట్స్‌లో కూడా ఓటమి చెందారు. మసాచూసెట్స్‌లోనే ఆయన ఉంటున్నారు. ఈ రెండు రాష్ట్రాలు ఒబామా ఖాతాలోనే పడటం గమనార్హం.

 ఒబామా గెలుపు: పదనిసలు

అమెరికా ఎన్నికల్లో తులసీ గబార్డ్ అనే 31 ఏళ్ల హిందూ అమెరికన్ యువతి గెలుపొందారు. అమెరికన్ కాంగ్రెసులో అడుగుపెట్టే తొలి హిందువుగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి తులసీ గబార్డ్ చరిత్ర సృష్టించారు. భారత సంతతికి చెందిన డాక్టర్ అమీ బెరా కూడా గెలుపొందారు.

తన విజయం ప్రజల విజయమని చెప్పి, ప్రత్యర్థి రోమ్నీని పొగడ్తలలో ముంచెత్తారు. రోమ్నీ తనకు గట్టి పోటీ ఇచ్చారని, ఆయన మంచి దేశభక్తుడని, ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటానని చెప్పారు. ఒబామా అమెరికా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో ఆయన సతీమణి మిచెల్లీ ఒబామా, కూతుర్లు కూడా వచ్చారు. ఒబామా గెలుపుతో డెమోక్రాట్లు ఆనందంలో మునిగిపోయారు.

English summary
US is in a celebratory mood. After Barack Obama was re-elected as US President on Tuesday, Nov 6, his supporters celebrated his victory in a grand manner. Obama thanked the nation for bringing him back to the White House. The 44th US President addressed Americans post his victory. His family members--wife Michelle and daughters Sasha and Malia were present with him during the celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X