• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు వద్దకూ 'దేనికైనా రెడీ' పంచాయతీ!

By Srinivas
|

Chandrababu Naidu
మహబూబ్‌నగర్: మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మాతగా వచ్చిన దేనికైనా రెడీ చిత్రం పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వద్దకు కూడా వచ్చింది. చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర పాలమూరు జిల్లాలో గురువారం కొనసాగింది. సాయంత్రం రంగారెడ్డి జిల్లాకు చేరుకుంది. ఆయన యాత్ర పాలమూరు జిల్లాలోని కోయిలకొండ మండలంలో సాగినప్పుడు శేరివెంకటాపూర్ గ్రామ బ్రాహ్మణులు చంద్రబాబును కలిశారు.

బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేనికైనా రెడీ చిత్రం ఉందని, దానిపై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని వారు చంద్రబాబును కోరారు. దేనికైనా రెడీ చిత్రంలో బ్రాహ్మణులను కించపర్చారని, ఇలాంటివి జరగకుండా చూడాలని వారు కోరారు. రాష్ట్రంలో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా అందరికీ రాజకీయంగా తమకు అవకాశాలు కల్పించాలని, బ్రాహ్మణులకు ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.

కాగా చంద్రబాబు తన పాదయాత్రలో వైయస్ పాలనపై మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం కావడానికి వైయస్ రాజశేఖర రెడ్డి పాలనే కారణమని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తు చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపినిచ్చారు. పేదలకు న్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమని, అందుకే పాదయాత్ర చేపట్టానని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మల్లపురం గేట్ వద్ద చంద్రబాబు నాయుడు ప్రజల నుద్దేశించి మాట్లాడారు.

తల్లిదండ్రులకు ఆడపిల్లలు భారం కాకుండా నిరుద్యోగభృతి కల్పిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని విమర్శించారు. రైతుల రుణమాఫీ ఎలా చేస్తానో చెప్పను, చేసి చూపిస్తానని అన్నారు. తమ పార్టీ పేదల పక్షంగా నిలబడి పోరుడుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూరారం వద్ద ఎమ్మార్పీఎస్ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న బాబు వర్గీకరణ దిశగా తమ పార్టీ నిర్ణయం వెలువరిస్తుందని హామీ ఇచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Denikaina Ready: Brahmins gives memorandum to Babu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more