వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్విస్ అకౌంట్లు బయటపెట్టిన కేజ్రీవాల్: లిస్ట్‌లో ముఖేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Arvind Kejriwal
న్యూఢిల్లీ: ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం మరో బాంబు పేల్చారు. స్విస్ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయంటూ పలువురి పేర్లు బయట పెట్టాడు. ఆయన ప్రకటించిన లిస్టులో ముఖేష్ అంబానీ, అనీల్ అంబానీ, అనూటాండన్, నరేష్ గోయల్, డాబర్ గ్రూపు తదితరుల పేర్లు ఉన్నాయి. బ్లాక్ మనీని పెద్ద ఎత్తున మన దేశానికి చెందిన పలువురు స్విస్ బ్యాంకులకు తరలిస్తున్నారని విమర్శించారు.

కేంద్రం వద్ద నల్ల కుబేరుల చిట్టా ఉందని, కానీ వారి పేర్లు బయట పెట్టేందుకు మాత్రం ముందుకు రావడం లేదన్నారు. నల్లధనం వెనక్కి తెచ్చేందుకు కేంద్రం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ జట్టులోని అనూటాండన్‌కు స్విస్ బ్యాంకులో అకౌంట్ ఉందన్నారు. ముఖేష్, అనీల్ అంబానీలు 2006లో చెరో వంద కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకుల్లో వేశారన్నారు.

స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న వారి చిట్టా తన వద్ద ఉందని, ఈ లిస్ట్‌ను తనకు ఓ కాంగ్రెసు నేతనే ఇచ్చారన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పైన దాడి కొనసాగించాలని స్వయంగా ఓ కేంద్రమంత్రే తనకు చెప్పారన్నారు. స్విస్ బ్యాంకులో అకౌంట్ ఉన్న అనూటాండన్ రాహుల్ టీమ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. బ్లాక్ మనీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.

స్విస్ బ్యాంకులో రిలయన్స్‌ది రూ.500 కోట్లు, సరేష్ గోయల్‌వి రూ.80 కోట్లు, మోటెక్ సాఫ్టువేర్‌వి రూ.2100 కోట్లు, అనూ టాండన్‌వి రూ.125 కోట్లు, డాబర్ గ్రూప్‌వి రూ.25 కోట్లు ఉన్నాయన్నారు. స్విస్ బ్యాంకులో 700 మంది భారతీయులకు ఎకౌంట్స్ ఉన్నాయని ఆరోపించారు. జెనీవాలోని హెచ్‌ఎస్‌బిసిలో అకౌంట్లు ఉన్నాయన్నారు. హెచ్ఎస్‌బిసిలో ఆరువేల కోట్ల భారత్ బ్లాక్ మనీ ఉందన్నారు.

English summary

 Breaking the suspense Arvind Kejriwal opened another can of allegations today, this time claiming to have details of black money stashed away in Swiss bank by top industrialists and even a politician reportedly 'close' to Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X