కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఫ్యాక్టర్: డిసిసి పదవికి కందుల విముఖత

By Pratap
|
Google Oneindia TeluguNews

Kandula Sivananda Reddy
కడప: పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోటగా మారిన కడప జిల్లాలో కాంగ్రెసు పార్టీకి తిప్పలు తప్పేట్లు లేవు. జిల్లాకు చెందిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వైయస్ జగన్‌ను ఎదుర్కుని విఫలమై, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తితో వేగిపోతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి రాజకీయ ప్రత్యర్థిగా భావించి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జగన్‌ను ఎదుర్కోవడానికి కందుల శివానందరెడ్డిని కడప జిల్లా డిసిసి ఇంచార్జీ అధ్యక్షుడిగా నియమించారు. అయితే, ఆ పదవి చేపట్టడానికి శివానంద రెడ్డి విముఖత ప్రదర్శించారు.

వైయస్ జగన్ ప్రాబల్యం కారణంగానే శివానంద రెడ్డి ఆ పదవిని స్వీకరించడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. తాను అ పదవిని చేపట్టలేనంటూ శివానంద రెడ్డి బొత్స సత్యనారాయణకు ఫాక్స్ ద్వారా తెలియజేసినట్లు తెలుస్తోంది. తనకు సమాచారం ఇవ్వకుండా తనను డిసిసి ఇంచార్జీ అధ్యక్షుడిగా నియమించారని కందుల శివానంద రెడ్డి అంటున్నారు.

మునిగిపోతున్న నావకు తాను ఏ విధంగా సారథ్యం వహిస్తానని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. ఖాళీ అయిన కాంగ్రెసు పార్టీకి సారథ్యం వహించేలా చేసి, దెబ్బ తీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన అంటున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన ముగ్గురు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు.

కడప లోకసభకు, పులివెందుల శాసనసభకు జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడానికి మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డితో కలిసి కందుల శివానంద రెడ్డి తీవ్రంగా శ్రమించారు. అయితే, ఫలితం కనిపించలేదు. ఇప్పుడు కూడా జగన్‌ను ఎదుర్కోవడానికి కందుల శివానంద రెడ్డిని డిసిసి ఇంచార్జీ అధ్యక్షుడిగా నియమించినట్లు చెబుతున్నారు.

English summary
Congress leader Kandula Sivananda Reddy has rejected taken up Kadapa DCC incharge president post. He is not interested, as the Congress is not in a position to face YSR Congress president YS Jagan in Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X